గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

22-04-2020 బుధవారం దినఫలాలు - నరసింహ స్వామిని ఆరాధిస్తే

మేషం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మెలకువ వహించండి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పును పొందుతారు. 
 
వృషభం : నూతన పరిచయాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. ప్రియతముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అధికారులతో  సంభాషించేటపుడు మెలకువ వహించండి. ఆడిటర్లకు సంతృప్తి, అభివృద్ధికానవస్తుంది. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. 
 
మిథునం : విద్యార్థులకు సంతృప్తికానరాదు. చేసే పనులలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. వైద్యులకు మిశ్రమ ఫలితం. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
కర్కాటకం : ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం సవూలు కాగలవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇవ్వగలవు. అనురాగ వాత్సల్యాలు పొందగలవు. ప్రయాణాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. 
 
సింహం : మార్కెటింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పనులు కొంత మందకొడిగా సాగుతాయి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చగలుగుతారు. 
 
కన్య : స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉందు. పెరిగిన కుటుంబ అవసరాలు రాబడికి మించిన ఖర్చులు వల్ల ఇబ్బందులకు గురవుతారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. కాంట్రాక్టర్లు ప్రముఖులక సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. 
 
తుల : సన్నిహితుల సలహాలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రుణ, బాధలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమానురాగాలు బలహీనపడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : ఎలక్ట్రికల్ రంగాలలో వారికి సామాన్యంగా ఉండగలదు. మీ సంతానం విషయంలో అసంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. క్రయ, విక్రయదారులకు అనుకూలం. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు స్థానమార్పిడి కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. అవివాహితులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలం జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు మీ ఉన్నతికి పురోభివృద్ధికి తోడ్పడతాయి. వృత్తులవారికి సదావకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చలు అనుకూలిస్తాయి. 
 
మకరం : సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. స్త్రీలకు వస్తు, వస్త్ర, ఆభరణాలకు అధికంగా ఖర్చు చేస్తారు. బిల్లులు చెల్లిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దూరంలో ఉన్న వ్యక్తుల గురించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. 
 
కుంభం : నూతన పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు శుభదాయకం. తలచినపనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మార్పులకు అనుకూలం. శుభకార్యక్రమాలు వాయిదాపడటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. 
 
మీనం : సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. లక్ష్యసాధనకు నిరంతరం కృషి అవసరం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రియతముల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అవివాహితులకు అనుకూలమైన కాలం. సాహిత్యాభిలాష పెరుగుతుంది. అవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.