గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

23-04-2020 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడిని పూజిస్తే...

మేషం : దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. మీ సంతానం వివాహం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ఉన్నత స్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మొక్కుబడులు తీర్చుకుంటారు. 
 
వృషభం : ముఖ్యమైన వ్యవహారలలో దీక్ష వహిస్తారు. మీకు రావలసిన ధనం సకాలంలో మీ చేతికి అందదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాలలో వారికి చికాకు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాల పట్ల ఏకాగ్రత కుదరదు. పౌరోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి తప్పదు. కార్మికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పారిశ్రామికులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
కర్కాటకం : బంగారు, వెండి, వస్త్ర రంగాలలో వారికి మెళకువ అవసరం. తోటివారి సహకారం వల్ల పాత సమస్యలు పరిష్కరించబడతాయి. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. క్రయ, విక్రయ రంగాలలో వారికి అనుకూలం. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. వాహనచోదకులకు చికాకులు తప్పవు. 
 
సింహం : అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులను ఎదుర్కొంటారు. రవాణా రంగంలోని వారికి లాభదాయకం. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు బ్రోకర్లకు, ఎక్స్‌పోర్టు వ్యాపారస్తులకు వారివారి రంగాలలో విజయం, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
తుల : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వృత్తుల వారికి బాధ్యతలు పెరుగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు ప్రోత్సాహం కానవస్తుంది. దైవ, దర్శనం చేసుకోగలుగుతారు. రిజర్వేషన్ రంగాల వారు సంతృప్తిని పొందుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
వృశ్చికం : గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పదు. విద్యార్థినుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, వాహనయోగం పొందుతారు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రత్యర్థుల తీరు చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు : కలప వ్యాపారస్థులకు అభివృద్ధి. అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. సిమెంట్ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. ప్రైవేటు సంస్థల వారికి అనుకూలం. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
మకరం : విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తికాగలవు. ధన వ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గమనిస్తారు. బంధువుల నుంచి వ్యతిరేకత, పట్టింపులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్త అవసరం. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. 
 
మీనం : మీ ప్రయత్నాలకు కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు రావలిసిన క్లైమ్‌లు మంజూరవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు.