మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (08:43 IST)

28-02-2019 గురువారం దినఫలాలు : ముక్కుసూటిగా పోయే మీ ధోరణి...

మేషం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. వాహన చోదకులకు చికాకులు తప్పవు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. రియల్‌‌ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.
 
వృషభం: స్త్రీలకు టీవి ఛానెళ్ల నుండి ఆహ్వానం అందుతుంది. రెట్టింపు ఉత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. మనస్సుకు ఉత్సాహంతో కొత్త యత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మిధునం: ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. ఇసుక కాంట్రాక్టర్లు, వాహన చోదకులకు జరిమానాలు తప్పవు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
 
కర్కాటకం: భాగాస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వెంచర్లలో పునరాలోచన మంచిది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవడం మంచిది కాదు. అతిధి మర్యాదలు విజయం సాధిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. 
 
సింహం: మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కుంటారు. తొందరపాటుతనం వలన ధననష్టంతో పాటు వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది.
 
కన్య: ఎల్.ఐ.సి ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌ల టార్గెట్ పూర్తవుతుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. మీ ఆలోచనలను గోప్యంగా ఉంచి గుట్టుగా యత్నాలు సాగించాలి. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు.  
 
తుల: నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు కొనసాగించాలి. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందిపడతారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. పోస్టల్, ఎల్.ఐ.సి. ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట అధికం. మీ హద్దుల్లో ఉండడం అన్ని విధాలా క్షేమదాయకం. బంధువులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
వృశ్చికం: ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయం గమనించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. సలహా ఇచ్చే వారే కానీ సహకరించే వారుండరు. టి.వీ కార్యక్రమాల్లో స్త్రీలు రాణిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. 
 
ధనస్సు: వ్యాపార రహస్యాలు ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు షాపింగ్‌లోను అప్రమత్తత అవసరం. కొత్త ఆలోచనలు, పథకాలతో ముందుకు సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
మకరం: రహస్యాన్ని దాచలేని మీ వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. ఊహించని ఖర్చులు, బంధువుల ఆకస్మిక రాకతో కించిత్ ఇబ్బందులు తప్పవు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులు, సంస్థల స్థాపనలు వాయిదా వేయండి. 
 
కుంభం: వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం అనుకూలిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ పనితీరు, విధేయతలు అధికారులను ఆకట్టుకుంటాయి. ఆలస్యంగా అయినా పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. 
 
మీనం: ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య దాపరికం కలహాలకు దారితీస్తుంది.