Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శుభోదయం : మీ రాశి ఫలితాలు (11-08-2017)

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (05:47 IST)

Widgets Magazine
daily astro

మేషం : ఈరోజు ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వాహనచోదకులకు దూకుడు తగదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బంధుమిత్రులు మొహమ్మాటానికి గురిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
వృషభం : ఈరోజు కుటంబసఖ్యత అంతగా ఉండకపోవచ్చు. స్త్రీలుదైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిర్మాణాత్మకమైన పనులలో చురుకుదనం కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహనా లోపం ఏర్పడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉపాధ్యాయులకు కొత్తకొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
మిథునం : ఈరోజు వృత్తి ఉద్యోగస్తులకు ఇది శుభసమయం. మీ విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల ఒకింత అసహనానికి గురవుతారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. దూర ప్రయాణాల్లో అసౌకర్యం, చికాకులు తప్పవు.
 
కర్కాటకం : ఈరోజు ఆర్థిక, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గృహ అవసరాలకు నిధులు సమకూర్చుకుంటారు.
 
సింహం : ఈరోజు రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ప్రధానం. సోదరీ సోదరులతో ఏకీభవించలేక పోతారు.
 
కన్య : ఈరోజు వృత్తులలో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. ఆలయ సందర్శనాలలో ప్రముఖులను కలుసుకుంటారు. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతాు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
తుల : ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. వస్త్రములు, విలువైన కానుకలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి.
 
వృశ్చికం : ఈరోజు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. పెరిగిన పోటీ వల్ల ఆందోళన తప్పదు. అకాల భోజనం మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికమవుతుంది. పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు.
 
ధనస్సు : ఈరోజు వృత్తి, ఉపాధ్యాయ పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. చిట్స్ ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులకు వల్ల ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
 
మకరం : ఈరోజు విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. చేపట్టిన పనులు ఓర్పుతో పూర్తి చేస్తారు. స్త్రీలు, కళాత్మకతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ చిన్నారులు ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
కుంభం : ఈరోజు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. రుణ యత్నాలలో అనుకూలత, రావలసిన ధనం అందుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి రాబడి అంతంతమాత్రంగానే ఉంటుంది. కళ, క్రీడా రంగాల వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది.
 
మీనం : ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. అపరిచిత వ్యక్తుల విషయలంలో తగుజాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. విలువైన పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. స్త్రీల ఓర్పు, ఏకాగ్రతలకు ఇది పరీక్షాకాలం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం... ఈ రోజు రాశి ఫలితాలు 10-08-2017

మేషం : ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, ...

news

ఎరుపు బట్టలో రాళ్ళ ఉప్పును వుంచి ప్రధాన ద్వారానికి కడితే?

ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. ప్రతికూల ప్రభావం, స్వభావం ...

news

ఇంట్లో చెప్పులేసుకుని తిరిగితే ఏమౌతుంది?

బయటికి వెళ్ళేటప్పుడు ఓకే కానీ.. ఇంట్లోనే ప్రస్తుతం చాలామంది చెప్పులేసుకుని వాక్ ...

news

శుభోదయం... ఈ రోజు రాశి ఫలితాలు 09-08-2017

మేషం : ఈ రోజు మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా ...

Widgets Magazine