గురువారం దత్తాత్రేయ ప్రార్థనతో పితృదోషాలు పరార్  
                                       
                  
				  				  
				   
                  				  గురువారం దత్తాత్రేయ స్తుతితో పితృదోషాలు పరారవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పుట్టుకతోనే యోగి అవతారంగా భావిస్తున్న దత్తాత్రేయుడిని గురువారం పూట పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా పితృదేవతల సంతృప్తి చెందుతారు. పితృదోషాలు తొలగిపోతాయి. వేద ఉపన్యాస జ్ఞానులకు సద్గురు వైన దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సమస్త దోషాలుండవు. 
 				  											
																													
									  
	 
	పరశురామునిచే హతమైన కార్తవీర్యార్జునుడి దత్తాత్రేయ శిష్యుడే. దత్తాత్రేయ పూజతో, కార్తవీర్యార్జున మంత్ర జపంతో దోపిడీకి, చోరీకి గురైన వస్తువులను తిరిగి పొందవచ్చు. అలాగే దత్తాత్రేయుడిని పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది. 
				  
	 
	ఇంకా త్రిమూర్తులను ఒకేసారి పూజించిన ఫలితం దక్కుతుంది. ఇంకా మనోబలం, దేహబలం చేకూరుతుంది. సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఉన్నత పదవులను అలంకరిస్తారు. అందుకే గురువారం పూట దత్తాత్రేయ గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు సంప్రాప్తిస్తాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	''ఓం దత్తాత్రేయ విద్మహే దిగంబరాయ ధీమహి, 
	తన్నో దత్త ప్రచోదయాత్''. అనే మంత్రాన్ని పఠించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిత పండితులు అంటున్నారు.