బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (19:42 IST)

ప్రతిరోజూ సింధూరం ధరిస్తే ఏంటి లాభమో తెలుసా?

ప్రతిరోజూ సింధూరం ధరించడం ద్వారా హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని నుదుటన ధరిస్తే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. 
 
ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. 
 
లో బీపీ ఉన్నవారు రక్త హీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది. 
 
ఇంకా ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని ధరిస్తే భయం తొలగిపోతుంది. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దరిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.