శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (16:00 IST)

2017 కర్కాటక రాశి ఫలితాలు... ప్రధమార్థం కంటే ద్వితీయార్థం...

కర్కాటక రాశివారికి ఆగస్టు వరకు ధన, కుటుంబ స్థానము నందు రాహువు, అష్టమము నందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మమము నందు రాహువు, సప్తమము నందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా చతుర్థ ము నందు, జూన్‌వరకు షష్ఠమము నందు శని, తదుప

కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదము, పుష్యమి 1,2,3,4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4  
ఆదాయం -11 వ్యయం-8 పూజ్యత -5 అవమానం -4
 
కర్కాటక రాశివారికి ఆగస్టు వరకు ధన, కుటుంబ స్థానము నందు రాహువు, అష్టమము నందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మమము నందు రాహువు, సప్తమము నందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా చతుర్థ ము నందు, జూన్‌వరకు షష్ఠమము నందు శని, తదుపరి వక్రగతిన పంచమము నందు, తదుపరి షష్ఠమము నందు సంచరిస్తాడు. 
 
మీ గోచారం పరీక్షించగా ''నమంతి ఫలినో వృక్షాః నమంతి గుణినో జనాః''అన్నట్లుగా ఫలాలిస్తున్న చెట్టు, గుణవంతులు, విజ్ఞానవంతులు, జ్ఞానులు ఎల్లప్పుడు ఎదుటివారు చెప్పేది గమనిస్తూ ఉంటారు. పదిమందికి సహాయం చేయడం వల్ల ఈ సంవత్సరం మీకెంతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు ఎదుర్కొన్నప్పటికీ సత్ఫలితాలు నెమ్మదిగా పొందగలుగుతారు. స్త్రీలకు మనోవాంఛలు నెరవేరుతాయి. అవివాహితులకు ఒక వార్త నెంతో సంతృప్తినివ్వగలదు. సెప్టెంబర్ నుండి అర్ధాష్టమ గురుదోషం ఏర్పడటం వల్ల విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అవసరం. 
 
మొదటి భాగం కన్నా రెండో భాగంలో సంతృప్తి ఉండగలదు. ఉపాధ్యాయులకు రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు కర్తవ్య నిర్వహణలో నిమగ్నులవుతారు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. గృహనిర్మాణ సంబంధ విషయాలు ఒక కొలిక్కివస్తాయి. ఆరోగ్యం ఏమంత సంతృప్తినివ్వదు. రాజకీయ పార్టీల్లో వారు ప్రత్యమ్నాయం కోరుకుంటారు. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వైద్య రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
విదేశీ యానయత్నాలు సఫలీకృతం కాగలవు. జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల కొంత ఆందోళనకు గురవుతారు. సంగీత, సాహిత్య కళా రంగాల్లో వారికి శ్రమ తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలమైన కాలం. ప్రింటింగ్, పత్రికా రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. అపరిచితులతో మెళకువ వహించండి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల మాట పెడచెవిన పెట్టి ఇబ్హందులకు గురికాకండి. ఏజెంట్లకు, బ్రోకర్లకు రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి ప్రముఖుల ఇంటర్వ్యూ నిరీక్షణ తప్పదు. 
 
పనులు నెమ్మదించినా అనుకున్న విధంగా పూర్తికాగలవు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు కొత్త చికాకులెదురవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం. మాటతీరుతో ఎదుటివారికి తేలికగా ఆకట్టుకుంటారు. 
 
* ఈ రాశివారికి అర్ధాష్టమ గురుదోషం ఏర్పడుతున్నందువల్ల సాయినాథుని ఆరాధన, రాఘవేంద్రస్వామి ఆరాధన సర్వదోషాలు తొలగిపోతాయి. జన్మమము నందు రాహుసంచారం వల్ల ఆహార, వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. 
 
* చండీకామాతను ఆరాధించడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది. పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం, పుష్యమి నక్షత్రం వారు పుష్య నీలం, ఆశ్లేష నక్షత్రం వారు గరుడపచ్చ ధరించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును, పుష్యమి నక్షత్రం పిప్పలి చెట్టును, ఆశ్లేషనక్షత్రం వారు బొప్పాయి చెట్టును, దేవాలయాల్లోగాని, విద్యా సంస్థల్లోని గాని, ఖాళీప్రదేశాల్లోగాని నాటిన శుభం కలుగుతుంది.