గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జులై 2024 (12:23 IST)

పంచమి రోజున వారాహి పూజ.. ఆ 12 నామాలు చాలా పవర్ ఫుల్

Varahi Puja
పంచమి రోజున వారాహి పూజ సకల సంపదలను ప్రసాదిస్తుంది. వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరు, ఆమె రాజరాజేశ్వరి దేవి సైన్యాధ్యక్షురాలు కూడా. వారాహి దేవిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
వారాహి దేవిని అమావాస్య, పూర్ణిమ, పంచమి, అష్టమి రోజుల్లో పూజించడం మంచిది. ఈమెకు ఐదు ముఖాల దీపాన్ని వెలిగించడం మంచిది. తీపి బంగాళాదుంప లేదా దానిమ్మను నైవేద్యంగా సమర్పించవచ్చు. వారాహి పూజ సజావుగా జరగడానికి.. ఆశీర్వాదం కోసం ఒక గణేశ మంత్రాన్ని పఠించాలి. 
 
వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపు చేయాలి. పూజ కోసం అమ్మవారి చిత్ర పటం, కాస్త గంధం, తెలుగు రంగు పూలు, సాంబ్రాణి దూపం ఉండాలి. అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయాలి.
 
హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టం అయినా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.