పౌర్ణమి పూజా ఫలం.. అంతా ఇంతా కాదు.. (Video)
ప్రతిమాసంలో పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ రోజున చంద్రుడిని పూజించడం ద్వారా.. చంద్రాష్టమ ప్రతికూలతల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే చంద్రుడు మనస్సు కారకుడు కావడంతో మానసిక ఇబ్బందులుండవు. అంతేగాకుండా చంద్రునికి వెలుగునిచ్చే సూర్య భగవానుడి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది.
అంతేగాకుండా పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రీ అంబికాదేవిని పౌర్ణమి రోజున పూజించే వారికి ఈతిబాధలుండవు. ఆ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. పౌర్ణమి రోజున గృహంలో ఇంటి దేవతను పూజిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన వంటివి చేయించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
పౌర్ణమి రోజున మహిళలు నిష్ఠతో ఉపవసించి, పసుపు, కుంకుమతో 108 సార్లు అమ్మవారిని స్తుతించి.. నైవేద్యం సమర్పిస్తే.. మాంగల్య బలం చేకూరుతుంది. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మృత్యుభయం వుండదు. సంతానప్రాప్తి దక్కుతుంది. ధనలాభం వుంటుంది. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
అలాగే ఎన్నో సంవత్సరాల పాటు వున్న రావి, వేప చుట్టూ ప్రదక్షణలు చేయడం ద్వారా వ్యాపారాల్లో రాణించవచ్చు. ఇంకా సత్యనారాయణ పూజ చేసే వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. అందుకే ఆదివారం (జూలై 5న వచ్చే పౌర్ణమి రోజున) చంద్రోదయం సమయంలో దంపతులు పౌర్ణమి పూజను ప్రారంభించి పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.