శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By PYR
Last Modified: శనివారం, 7 ఫిబ్రవరి 2015 (19:16 IST)

చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే... అందగత్తెలవుతారా...? ఎంతకాలం జీవిస్తారు?

పుట్టు మచ్చ ఎక్కడుంటే ఏంటి? మచ్ఛ శరీరంలో మచ్చే కదా..? నల్లగా కనిపిస్తుంటుంది. అనుకునే వారు కొందరైతే దానిని తీయించేవారు కూడా ఉన్నారు అయితే పుట్టుమచ్చలను బట్టి వారి స్వభావం, అందచందాలను నిర్ణయించేయవచ్చట. చెక్కిలిపై పుట్టుమచ్చ ఉన్నవారు అందగత్తెలవుతారని చెపుతున్నారు. 
 
కుడి చెక్కిలిపై మచ్చ ఉంటే మంచి అందమైన వారు అవుతారట. వయస్సు కూడా యవ్వన వంతులుగా ఉంటారు. అదే సమయంలో చాలా సున్నిత మనస్కులు అవుతారట. దాదాపు 82 యేళ్ల పాటు జీవిస్తారట. ఎడమ చెక్కిలిపై పుట్టు మచ్చ ఉంటే చిరాకు, గోరంతలు కొండంతలు చేసుకుంటారట. 
 
బాల్యమంతా ఇబ్బందుల పాలయినా, నడివయస్సులో సంపాదిస్తారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉంటారట. 90 యెళ్ళు వచ్చే వరకూ ఆరోగ్యంగా ఉంటారట.