శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : గురువారం, 26 జులై 2018 (13:12 IST)

వివాహం జరుగుతున్నట్లుగా కలవస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా ఎవరైనా ఒక విషయాన్ని గురించి అదేపనిగా ఆలోచిస్తుంటారు. ఆ విషయం దృశ్యరూపాన్ని సంతరించుకుని కలగా రావడం జరుగుతుంది. అలా వచ్చే కలల్లో ఆనందాన్ని కలిగించేలా, ఆందోళన కలిగించేలా వస్తుంటాయి. ప్రమాదం జరిగినట్లు కలవస్తే కంగారుతో భయపడుతుంటారు చాలామంది. ఇ

సాధారణంగా ఎవరైనా ఒక విషయాన్ని గురించి అదేపనిగా ఆలోచిస్తుంటారు. ఆ విషయం దృశ్యరూపాన్ని సంతరించుకుని కలగా రావడం జరుగుతుంది. అలా వచ్చే కలల్లో ఆనందాన్ని కలిగించేలా, ఆందోళన కలిగించేలా వస్తుంటాయి. ప్రమాదం జరిగినట్లు కలవస్తే కంగారుతో భయపడుతుంటారు చాలామంది. ఇలా వచ్చిన కలలో కొన్నిమాత్రమే సమయాన్ని బట్టి ఫలిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది.
 
వివాహవేడుక జరుగుతున్నట్టుగా చాలామంది కలలు వస్తుంటాయి. ఇలాంటి కలవస్తే శుభప్రదమైన విషయాలు జరుగబోతున్నాయని చెప్పబడుతోంది. కలలో వివాహ వేడుకను చూడడం వలన అనతికాలంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వినడం, శుభకార్యలు జరపడం లేదా పాల్గొనడం వంటివి జరుగుతాయి. అంతే కాకుండా ఏదో ఒక రూపంలో ధనయోగం కలుగుతుందని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది.