గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (14:48 IST)

ముక్కుకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?

సాధారణంగా పుట్టుమచ్చులు అనేవి అందరికీ ఉండేవి. శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటాయి. ఒకవేళ మచ్చ ముక్కు భాగంలో ఉంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నింటిని దిగ్విజయంగా పూర్తిచేస్తారు. అలానే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ఇక ముక్కు కుడి భాగంలో మచ్చ ఉన్నచో వారు దేశ సంచారం చేయుదురు. శత్రువులకు భయపడుతారు. ఇతరుల ఆస్తి లభిస్తుంది.
 
ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనోగర్వం, అహంభావం కలవారైయుంటారు. విరక్తి భావన కలిగియుంటారు. ఇతరులను చులకనగా చూసే స్వభావం గలవారు. ముక్కు ఎడమ భాగంలో మచ్చ ఉంటే.. నూతన స్త్రీల సంభోగసౌఖ్యం కలుగుతుంది. 
 
ముక్కుకు క్రిందిభాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు తలపెట్టిన కార్యక్రమాలు కష్టంమ్మీద జయం చేకూరుతుంది. సామాన్య ధనలాభం కలిగియుందురు. మధ్య మధ్యలో ధనవ్యయం ఉండును. ముక్కు పుటముల క్రింది భాగంలో మచ్చ ఉన్నచో వారు అనేక భాషలు నేర్చినవారైయుంటారు. మెుత్తం మీద వీరి జీవితం సౌఖ్యంగా ఉండును.