ముక్కుకు ఎడమ భాగాన మచ్చ ఉందా..?

mole on the face
Last Updated: మంగళవారం, 29 జనవరి 2019 (15:39 IST)
పుట్టుమచ్చలు ప్రతిఒక్కరికీ ఉండేవే. ఏ ప్రాంతంలో వస్తుందని చెప్పలేం. అవి వస్తే ఏం జరుగుతుందని కూడా చెప్పలేం. కానీ, పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం తెలుసుకోవచ్చట. అదేవిధంగా ముక్కు భాగాల్లో మచ్చలు ఉంటే కలిగే లాభాలు, నష్టాలు ఓసారి తెలుసుకుందాం...

1. ముక్కుచివర పుట్టుమచ్చ ఉన్నచో తలచిన కార్యమెట్టిదైనను త్వరిత కాలంలో నిర్విఘ్నముగ కొనసాగుచుండును. ముక్కునకు కుడిభాగాన మచ్చ ఉంటే.. దేశసంచారం చేయువాడగును. శత్రువులు భయపడుదురు. ఇతరుల ఆస్తి లభించును.

2. ముక్కునకు ఎడమ భాగాన పుట్టుమచ్చ ఉన్నచో సదా నూతన స్త్రీల సంభోగసౌఖ్యం కలుగుచుండును. ముక్కునకు క్రింది భాగాన మచ్చ ఉన్నచో.. తలచి కార్యములు కష్టం మీద జయమగుచుండును. సామాన్య ధనలాభం కలుగును. మధ్యమధ్య ధనం వ్యయమగు చుండును.

3. ముక్కునకు చివరి భాగాన మచ్చ ఉన్నచో కొంచెం కోప స్వభావం కలవాడుగును. మనోగర్వము, అహంభావం అధికమగు చుండును. విరక్తిభావమును కలిగియుండును. ఇతరులను చులకనగా చూచు స్వభావం కలిగియుండును.దీనిపై మరింత చదవండి :