గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (16:26 IST)

చేతి వేళ్లపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఏంటి?

సాధారణంగా చాలామంది పుట్టుమచ్చల శాస్త్రం తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటారు. కానీ, ఎలా చూపించుకోవాలనేది తెలియదు. ఈ పుట్టమచ్చల శాస్త్రం ప్రకారం మచ్చలు చేతివేళ్లల్లో ఎక్కడెక్కడ ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..
 
బొటన వ్రేలు
బొటన వ్రేలు గోరుమీద తెల్లమచ్చ ఉన్నచో వారు తలచిన కార్యాలు త్వరలోనె నేరవేరుతాయి. అన్యస్త్రీ పరిచయం కలుగుతుంది. ఒకవేళ ఆ మచ్చ నల్లగా ఉన్నచో కార్యక్రమాలు నాశనమవుతాయి. స్త్రీ పురుషుల మధ్య కలహాలు ఏర్పడుతాయి. 
 
చూపుడు వ్రేలు
చూపుడు వ్రేలి గోరుమీత తెల్లమచ్చ ఉంటే.. వారి ఉద్యోగ ప్రాప్తి, గొప్పవారితో పరిచయాలు, ధనలాభం వంటి శుభపరిణామాలుంటాయి. ఆ మచ్చే నల్లగా మారిందంటే.. మిత్రవిరోధం, ఉద్యోగనష్టం, ధన నష్టం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మధ్య వ్రేలు
మధ్యవ్రేలి గోరుమీద తెల్లమచ్చ ఉన్నచో వారికి వ్యాపారంలో ధనలాభం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా నీటి మీద ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. 
 
ఉంగరపు వ్రేలు
ఉంగరపు వ్రేలులో తెల్లమచ్చ ఉన్నచో.. వారు తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆ మచ్చ నల్లగా ఉంటే.. ధననష్టం, అగౌరవం, అపజయం కలుగుతుంది. 
 
చిటికెన వ్రేలు
చిటికెన వ్రేలు తెల్ల మచ్చ ఉంటే.. వారి ప్రయత్న కార్యక్రమాలు జయం, వ్యాపారం నందు ధనలాభం, విద్యాప్రాప్తి కలుగును. ఒకవేళ ఆ మచ్చ నల్లగా ఉన్నచో.. మరణం సంభవించునని తెలుసుకొనవలయును.