కన్ను అదిరితే ఏం జరుగుతుందో తెలుసా?

గురువారం, 5 జులై 2018 (12:02 IST)

అప్పుడప్పుడు కన్ను అదరడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కుడికన్ను, ఒక్కోసారి ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. సాధారణంగా కన్ను అదరడం గురించి చాలామంది పట్టించుకోరు. కన్ను అదరడం కూడా ఒక శకున సంకేతమేనని తెలిసినవారు మాత్రం దాని గురించి ఆలోచిస్తారు.
eyes
 
పురుషులకు ఎడమకన్ను, స్త్రీలకు కుడికన్ను అదరడం మంచిది కాదనే విశ్వాసం పురాణకాలం నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కుడికన్ను అదరగానే ఏదో కీడు జరగనుందని స్త్రీలు ఆందోళన చెందుతుంటారు. రావణుడు అపహరించడానికి ముందు సీతమ్మ వారికి కూడా కుడికన్ను అదిరినట్టు కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అరణ్యప్రాంతంలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఆహ్లాదాన్ని కలిగించే ఒక ప్రదేశంలో కొంతకాలం ఉండదలచి పర్ణశాలను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడవారికి ఆనందంగా రోజులు గడిచిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే రావణుడి సోదరి అయిన 'శూర్పణఖ' ముక్కుచెవులను లక్ష్మణుడు కోస్తాడు. ఆ సంఘటన అక్కడితో ముగిసిందని వాళ్లు అనుకుంటారు.
 
కానీ తన సోదరికి జరిగిన అవమానానికి రావణుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకు గాను శ్రీరాముడి భార్య అయిన సీతను అపహరించాలని అనుకుంటాడు. ఆ సమయంలోనే ఇక్కడ సీతమ్మకి కుడికన్ను అదిరిందట. దాంతో ఏదో కీడు జరగనుందని సీతమ్మ ఆందోళనని వ్యక్తం చేసినట్టుగా చెప్పబడుతోంది. ఇలా కుడికన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందనే విశ్వాసం ఆ కాలం నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

గురువారం (05-07-2018) దినఫలాలు - మీ అంచనాలు...

మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి అవకాశాలు లాభిస్తాయి. కుటుంబీకుల ...

news

04-07-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. ఒంటరిగానే లక్ష్యాలను?

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రహస్య విరోధులు అధికం కావడం ...

news

నరదృష్టిని, వాస్తుదోషాలను పోగొట్టే తెల్లజిల్లేడు.. శ్వేతార్క గణపతిని పూజిస్తే? (video)

తెల్లజిల్లేడు చెట్టుల్లో తొమ్మిది రకాలున్నాయి. తెల్లజిల్లేడు చెట్టు 12 సంవత్సరాలు వర్షం ...

news

పితృదోషాలను ఎలా తొలగించుకోవాలో తెలుసా?

పూర్వీకులు, తాతముత్తాలను పితృదేవతలు అంటారు. వారికి జరగాల్సిన ప్రేత కార్యక్రమాలను సక్రమంగా ...