Widgets Magazine

జూన్ నెల 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారైతే..?

జూన్ నెల 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి.. ఈ నెల సత్ఫలితాలను ఇస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అనుకున్న కార్యాలు మందకొడిగా సాగుతాయి. యవ్వనం, ఆకర్షణీయమైన అందంతో ఇతరులను కట్టిపడేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. ధనాద

June
ivr| Last Modified శనివారం, 9 జూన్ 2018 (19:56 IST)
జూన్ నెల 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి.. ఈ నెల సత్ఫలితాలను ఇస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అనుకున్న కార్యాలు మందకొడిగా సాగుతాయి. యవ్వనం, ఆకర్షణీయమైన అందంతో ఇతరులను కట్టిపడేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. ధనాదాయం ఉంటుంది. సంతానం కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. సోదరీ వర్గంతో శుభకార్యాలు జరుగుతాయి. తలనొప్పి, ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. 
 
తల్లి వర్గపు బంధువుల నుంచి తలెత్తిన అభిప్రాయబేధాలు కొలిక్కి వస్తాయి. విదేశీయానం అనుకూలిస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. ఆధ్యాత్మికంపై ఆసక్తి పెరుగుతుంది. ముందు చేసిన సహాయాలకు గౌరవం దక్కుతుంది. ఆడంబర ఖర్చులను తగ్గించే దిశగా చర్యలు చేపడతారు.
 
అలాగే నిద్రలేమి, స్వప్న సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రభుత్వ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి. వ్యాపార రీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. కార్యాలయాల్లో సహోద్యోగుల సహకారం అందుతుంది. బ్రోకరేజ్, కమీషన్‌లలో లాభముంటుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారులను మెప్పిస్తారు. కళాకారులకు అనుకూలం. అనుకున్న కార్యాన్ని ఈ నెలలో సద్వినియోగంగా పూర్తి చేస్తారు. 
 
అదృష్టమైన తేదీలు : 3, 7, 12, 16, 21, 25, 30
అదృష్టమైన సంఖ్యలు : 3, 7
అనుకూలించే రంగులు : ఆరెంజ్, క్రీమ్, తెలుపు. 
అనుకూలించే రోజులు : గురు, శుక్రవారాలు.


దీనిపై మరింత చదవండి :