Widgets Magazine

09-06-2018 - శనివారం.. మీ రాశి ఫలితాలు... తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా...

మేషం: కార్యసాధనలో ఓర్పు, పట్టుదలతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. రాబడికి మించిన ఖర్చులున్నా ఆర్ధిక వసూలుబాటు ఉంటుంది. ఇతరుల విషయాలకు

raman| Last Updated: శనివారం, 9 జూన్ 2018 (09:12 IST)
మేషం: కార్యసాధనలో ఓర్పు, పట్టుదలతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. రాబడికి మించిన ఖర్చులున్నా ఆర్ధిక వసూలుబాటు ఉంటుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. దూరప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృషభం: భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని కచ్చితంగా తెలియజేయండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. బంధువులతో అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
మిధునం: కలప, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మార్కెట్ రంగాలవారు టార్గెట్లను సునాయాసంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. 
 
కర్కాటకం: డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేముందు జాగ్రత్త అవసరం. రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరుగగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. బేకరి, పండ్ల, పూల, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
సింహం: భాగస్వామికుల మధ్య అవగాహన లోపిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మనోధైర్యముతో ఎంతటి కార్యానైనా సాధించగలుగుతారు.
 
కన్య: వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. కొన్ని విషయాల్లో ఓర్పును కోల్పోతారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. చిన్నపాటి ఆనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవలసి వస్తుంది. 
 
తుల: సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కుటుంబ సమస్యల గురించి ధనమును అధికంగా ఖర్చు చేయవలసివస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రియతముల పట్ల, పిల్లల పట్ల ప్రేమానురాగాలు బలపడతాయి. 
 
వృశ్చికం: విద్యార్థులను అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలసివస్తాయి. అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. చేపట్టిన పనులు మెుక్కుబడిగా పూర్తిచేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల వ్యవహారాలు అనకూలిస్తాయి. విద్యారంగంలోని వారికి నూతన ఉత్సాహం, పురోభివృద్ధి.
 
మకరం: భాగస్వాముల ఉభయులకు ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలించవు. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ఖర్చుల వలన ధనం వ్యయం చేస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
కుంభం: ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో సమసిపోగలవు. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగిరాజాలదు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రాజకీయ కళారంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మీనం: ఇంజనీరింగ్ రంగంలోని వారికి చికాకులు తప్పవు. మీ చుట్టు ప్రక్కల వారు మీ సహాయం అర్థిస్తారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల సమస్యలను ఎదుర్కొవలసివస్తుంది. రవాణా రంగంలోని వారికి మిశ్రమ ఫలితం. పాత సంబంధ భాంధవ్యాలు మెరుగుపడుతాయి. వ్యాపారాభివృద్ధికి చేయి కృషిలో రాణిస్తారు.


దీనిపై మరింత చదవండి :