Widgets Magazine

శుక్రవారం (08-06-2018) దినఫలాలు - తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం...

శుక్రవారం, 8 జూన్ 2018 (08:43 IST)

astrology

మేషం: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
వృషభం: పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అనుకోని అతిథుల ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 
 
మిధునం: వృత్తుల వారికి పురోభివృద్ధి, గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. స్త్రీలు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అనుకూలమైన సమయం. 
 
కర్కాటకం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ కళత్ర మెుండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు లాభదాయకం. రాజకీయ రంగాలలో వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు.
 
సింహం: మిత్రులతో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. ఏసీ కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
కన్య: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. శాస్త్రసాంకేతిక, వైద్య రంగాలవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. 
 
తుల: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఒకటికి పదిసార్లు యత్నించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు.
 
వృశ్చికం: విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభాదాయకంగా ఉంటుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. మెుండి బాకీలు వసూలు కాగలవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఆహార వ్యవహారాలలో పరిమిత పాటించండి. 
 
ధనస్సు: బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసివస్తుంది. రాజకీయాలలోవారు విరోధులువేసే పథకాలను తెలివితో తిప్పిగొట్ట గలుగుతారు. కంపెనీలో పనిచేయువారికి సంతృప్తి కానవస్తుంది. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు.
 
మకరం: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వస్తువులను, వస్త్రములను, ఆభరణములను కొనుగోలు చేస్తారు. మిత్రులలో ఒకరి ధోరణి మీకు ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం: స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎక్కడో పొరపాటు చోటుచేసుకుంటుంది. ఏసీ కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు లభించిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.
 
మీనం: మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. మీ సంతానం ఉన్నతి కోసం బాగా శ్రమిస్తారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

మహిళలు ఉంగరాలను చూపుడు వేలికి పెట్టుకుంటే?

మహిళలు ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళకు నిండుదనం వస్తుంది. ...

news

ఏలినాటి శనిదోషాలను తొలగించడానికి రావిచెట్టును నాటితే?

జ్యోతిష్య శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క ...

news

గురువారం (07-06-18) దినఫలాలు - భవిష్యత్ గురించి తగుశ్రద్ధ...

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు ...

news

ప్రదోషకాలంలో అలాచేస్తే.. డబ్బు ఆదా అవుతుందట..

ఈశ్వర ఆరాధన ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ...

Widgets Magazine