Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్యారాశి జాతకులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారట..

శుక్రవారం, 24 మార్చి 2017 (14:48 IST)

Widgets Magazine

జ్యోతిష్క్యానికి సంబంధించినంతవరకు ఒక్కో రాశికి ప్రత్యేకత ఉంది. మనుషుల అలవాట్లకు రాశులకు సంబంధం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. మనిషి స్వభావం రాశులను బట్టి మారుతూ వుంటుంది. స్వభావం, అలవాట్లు, వివాహ సంబంధాలు వంటి ఇతరత్రా అంశాలు రాశులకు ముడిపడివుంటాయి. అలా ఏ రాశిలో జన్మించిన వారు ప్రేమ వివాహం చేసుకుంటారని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదవండి.
 
వృషభం, కర్కాటకం, కన్యారాశి, ధనుస్సు, మీనరాశి జాతకులు ప్రేమ వ్యవహారాలతో పాటు వివాహాలపై అధికంగా ఆసక్తి చూపుతారు. ఇందులో వృషభ రాశి జాతకులు ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిగా మార్చుకుంటారు. కన్యారాశి జాతకులు మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. అంటే కన్యారాశి జాతకులు ప్రేమ ఫలించినా.. ఆపై భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు. 
 
ప్రేమించడం.. ప్రేమికులకు సహకరించడం వంటి పనుల్లో వృషభం, కర్కాటకం, కన్యారాశి, ధనుస్సు, మీనరాశి జాతకులు ముందుంటారు. అయితే ఈ జాతకులు ప్రేమలో సఫలం అవుతారా? విఫలం అవుతారా? అనే విషయం మాత్రం వారి వారి సొంత జాతకాలను పరిశీలించే చెప్పగలమని జ్యోతిష్కులు అంటున్నారు. సాధారణంగా ఒకరి జాతకంలో శుక్ర దశ అనుకూలంగా ఉంటే.. ప్రేమించిన వారినే పెళ్లాడుతారు. 
 
అయితే శుక్రదశ నీచంగా ఉంటే మాత్రం ప్రేమలో విఫలం తప్పదు. ఒకవేళ వివాహం జరిగినా విడాకులు, మనస్పర్ధలకు దారితీస్తుంది. సాధారణంగా ఏ లగ్నమైనా, రాశి అయినా కళత్ర స్థానం అనే 7, 8 స్థానాలను బట్టే వివాహ జీవితం ఉంటుంది. ఒకరికి  7, 8 స్థానాలు సక్రమంగా ఉంటే.. పాప గ్రహాల దృష్టి ప్రభావం లేకుంటే వారికి పెద్దలు కుదిర్చే వివాహం జరుగుతుంది. అదే కళత్ర స్థానం, పూర్వ పుణ్య స్థానం రెండూ బలంగా ఉంటే సన్నిహితులు, బంధువులతో వివాహం కుదురుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే మామిడి తోరణం.. ఎలాగంటే?

చిన్న శుభకార్యమైనా, చిన్న లేదా పెద్ద పండగొచ్చినా.. ఇంటి గడపకు మామిడి తోరణం కట్టేస్తాం. ...

news

కన్యారాశి జాతకులు తమలపాకులో మిరియాలను ఉంచి.. గురువారం పూట?

కన్యారాశి - తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. ...

news

ఎంత బంగారం కొన్నా బ్యాంకుల్లో తనఖా పెట్టాల్సి వస్తోంది.. ఎందుకూ?!

పొరపాటున కాని తెలిసి కాని పడకగది మంచం మీద ఇవి మాత్రం అస్సలు పెట్టకండి పెడితే దారిద్ర్యం ...

news

బెడ్రూంలో అలాంటి వాల్ పేపర్స్ పెట్టకూడదట... ఎంచేతనంటే?

ఇంట్లో గోడలపై చేతికి అందిన వాల్ పేపర్లు తెచ్చేసి అంటించేస్తుంటారు చాలామంది. కానీ కొన్ని ...

Widgets Magazine