శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (15:59 IST)

కార్తీక మాసంలో చెరువులు, బావుల్లో గంగాదేవి.. నువ్వుల నూనెను..?

Karthika Masam
కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటికిటలాడిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు కూడా ఇందుకోసం ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కార్తీక మాసంలో శివుడిని ప్రార్థించే భక్తులు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం జోలికి నెలరోజులు వెళ్లకూడదు. ఉల్లి, మద్యం, మాసం వంటి వాటికి దూరంగా ఉండాలి.
 
నిత్యం దీపారాధనలు చేయాలి. నువ్వుల నూనెతో వెలిగించే దీపం ఇంటికి అష్టైశ్యర్యాలతో పాటు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
రోజూ తలస్నానం చేయాలి. 
ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయాలి. 
కార్తీక పురాణం పుస్తకంలో ప్రతిరోజూ ఒక అధ్యాయాన్ని చదవాలి. వినడం కూడా చేయొచ్చు. సోమవారాలు, కార్తీక పూర్ణిమ విశిష్టమైనవి. 
 
రోజూ పూజ, ప్రసాదం తప్పనిసరి. 
దీపం వెలిగించడానికి తప్ప మరే పనికి నువ్వుల నూనె వాడకూడదు.
 30 రోజుల పాటు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. రాత్రిపూట అల్పాహారం తీసుకోవచ్చు. కనీసం సోమవారాలు, కార్తీక పూర్ణిమ, కోటి సోమవారం మొదలైన శుభ దినాలలో దీన్ని తప్పక పాటించాలి.
  
కార్తీక మాసం ప్రాముఖ్యత:
శ్రీ మహా విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు.
శివుడు కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాసురులను సంహరించి ప్రపంచాన్ని రక్షించాడు.
గంగాదేవి నదులు, కాలువలు, చెరువులు, బావులలోకి ప్రవేశించి వాటిని గంగలా పవిత్రంగా చేస్తుంది.
అయ్యప్ప దీక్షను కార్తీక మాసంలో తీసుకుంటారు. మకర సంక్రాంతి వరకు కొనసాగిస్తారు.