శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (16:17 IST)

కేతు గ్రహ దోషాలను తొలగించే అన్నదమ్ములు.. వాళ్లెవరో తెలుసా?

కేతు గ్రహ దోషాలను తొలగించుకునేందుకు అన్నదమ్ములను పూజించండి.. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వాళ్లెవరో కాదు.. విఘ్నాలను తొలగించే వినాయకుడు.

కేతు గ్రహ దోషాలను తొలగించుకునేందుకు అన్నదమ్ములను పూజించండి.. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వాళ్లెవరో కాదు.. విఘ్నాలను తొలగించే వినాయకుడు. అతని సోదరుడైన కుమార స్వామి. వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. 
 
వినాయకుడిని రోజూ 9 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన, కేతుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు. కేతు గ్రహదోషాల నుంచి నివారణ లభించాలంటే మంగళవారం పూట వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అభివృద్ధిపరంగా అడుగుముందుకు పడకపోవడం ... అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గణనాథుడిని పూజించడం ద్వారా కేతు గ్రహాధిపతి శాంతిస్తాడని.. తద్వారా ఈతిబాధలను తగ్గిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
కేతువు మోక్ష కారకుడు. అతని వల్ల దోషం కలిగితే ఈతిబాధలు తప్పవు. కేతువులో తాంత్రికం వంటి ప్రతికూల ప్రభావాలుంటాయి. అదే కేతు గ్రహాన్ని శాంతింప జేసుకుంటే.. మానసిక, శారీరక సామర్థ్యాలు పెరుగుతాయి. ధైర్యం వెన్నంటి వుంటుంది.

అందుకే మంగళవారం పూట నువ్వుల నూనెతో కేతు గ్రహానికి దీపమెలిగించాలి. ఆపై వినాయకుడు, కుమార స్వామికి నేతితో దీపమెలిగించి స్తుతిస్తే కేతు దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.