శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (18:46 IST)

కేతువు వలన కలిగే దోషాలు.. శాంతి మార్గాలు!

కేతువు మోక్షవిజ్ఞాన కారకుడు చపలత్వము, జ్ఞానహీనత, శత్రుబాధలు, దేశములు తిరుగుట, ఉన్మాదము, దృష్టమాంద్యము, కర్రదెబ్బలు, క్షుద్రము మంత్ర ప్రయోగములు మొదలగునవి కలిగినచో కేతువు బలహీనుడని గుర్తించాలి. 
 
కేతువు ధ్యానం 
లాంగూలయుక్తం భయదంజనానం కృష్ణాంబు భృత్సన్నిభ మేకవీరమ్|
కృష్ణాంబరం శక్తి త్రిశూల హస్తం కేతుం భజేమానస పంకజే హమ్ ||
ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
 
కేతుమంత్రం 
ఓం హ్రీం క్రూం క్రూరరూపిణే కౌతలే ఐం సాః స్వాహా ||
 
14 9 16
15 13 11
10 17 11 
కేతుయంత్రం 
సోమవారం రాత్రి చంద్రహోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్యలో ఈ యంత్రం ధరించాలి. ప్రతినిత్యం ఉదయము స్నానం చేసి శుచిగా కేతుధ్యానం 39 పర్యాయాలు చెయ్యాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 10 సోమవారాలు ఉలవలు దానం ఇవ్వాలి.