ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (22:10 IST)

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

Lakshmi Puja
దీపావళి సమయంలో లక్ష్మీ పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. దీపావళి రోజున లక్ష్మి పూజను అక్టోబర్ 31, నవంబర్ 1 సాయంత్రం చేయవచ్చు. 2024లో, అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1న సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. 
 
లక్ష్మీ పూజ ఎలా చేయాలి 
ఇంటిని పూర్తిగా శుభ్రంగా సిద్ధం చేసుకోండి: ప్రతి గదిని శుభ్రం చేయండి. ఉపయోగించని లేదా పాత వస్తువులన్నింటినీ తీసివేయండి. ముఖ్యంగా ప్రవేశద్వారం వద్ద రంగోలి, పువ్వులు, నూనె దీపాలను ఉపయోగించండి. 
 
పూజా స్థలాన్ని లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను ఉంచండి. శ్రీయంత్రం కూడా ఉపయోగించవచ్చు.  21 దీపాలను వెలిగించాలి. తాజా పువ్వులు, స్వీట్లు, పాయసం, పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. తామర పువ్వులు, వెండి నాణేలు, యాలకులు పూజలో వుంచవచ్చు.
 
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తయారుచేసిన మిశ్రమం (పంచామృతంను) పూజ సమయంలో సమర్పించవచ్చు. దీపాలను వెలిగించడంతో పూజను ప్రారంభించి.. ఆపై గణేశుడిని ప్రార్థించాలి. లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. పువ్వులు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించి.. ఇంటిల్లపాది దీపాలను వెలిగించాలి. 
 
లక్ష్మీ పూజ రోజున పరిసరాలను శుభ్రం చేసి అలంకరించడం ద్వారా అదృష్టం వస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద చెత్తతో పాటు బూట్లు ఉంచవద్దు. ఇంకా దీపావళి నాడు మాంసాహారం, మద్యపానం ముట్టుకోకూడదు.