వక్షస్థలంపై బల్లి పడితే ఫలితం ఏమిటో తెలుసా? (video)
గోళ్ళపై బల్లిపడితే ఎలాంటి ఫలితం ఏర్పడుతుందంటే..? ఎడమచేతి వైపు గోళ్లపై బల్లిపడితే.. నష్టం తప్పదు. అలాగే కుడిచేతి లేదా కుడి కాలి గోళ్లపై బల్లిపడినా ఖర్చులు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే బల్లి ఏ ప్రదేశంలో పడితే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం..
* తల ఎడమ వైపు బల్లి పడితే కష్టాలు, కుడివైపు పడితే కలహాలు తప్పవు
* నుదుటి ఎడమ వైపు బల్లి పడితే కీర్తి. కుడివైపు పడితే లక్ష్మీదేవి అనుగ్రహం.
* కడుపుకు ఎడమవైపు బల్లి పడితే సంతోషం, కుడివైపు పడితే శుభఫలితాలు వుంటాయి.
* వెన్ను ఎడమవైపు బల్లిపడితే.. కష్టాలు.. కుడివైపు పడితే నష్టం.
* కంటి ఎడమవైపు బల్లిపడితే.. భయం. కుడివైపు పడితే సుఖం.
* చర్మం ఎడమవైపు బల్లిపడితే.. విజయం. కుడివైపు పడితే విజయం.
* పిరుదులపై పడితే ఆదాయం
* ముక్కుపై పడితే.. ఈతిబాధలు, వ్యాధులు తప్పవు.
* మణికట్టుపై పడితే.. ఎడమవైపు కీర్తి, కుడివైపు అప్రతిష్ట
* తొడలపై ఎడమవైపు బల్లిపడితే.. నష్టాలు
* చెవులు: కుడివైపు పడితే లాభం, ఎడమవైపు పడితే ఆయుష్షు
* వక్షస్థలం: కుడివైపు బల్లి పడితే సుఖం. ఎడమవైపు పడితే లాభం.
మెడపై బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయంటే.. ఎడమవైపు పడినట్లైతే గెలుపు, కుడివైపు పడితే శత్రుభయం తప్పదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.