శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 12 జులై 2018 (17:14 IST)

శివానుగ్రహం కోసం ఎనిమిది వ్రతాలు.. అవేంటో తెలుసా?

శివలింగార్చనతో అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వ్రతాలను పాటిస్తే సరిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలు, నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే

శివలింగార్చనతో అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వ్రతాలను పాటిస్తే సరిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలు, నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఈశ్వరుడిని ఆరాధించాలి. అలాగే శివుడికి ప్రీతికరమైన ఎనిమిది వ్రతాలను ఆచరించాలి. అవేంటో ఓసారి చూద్దాం.. 
 
సోమవార వ్రతం... దీన్ని సోమవారం పూట చేయాలి. ఈ రోజున ఈశ్వరుడిని ఆరాధించడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆరుద్ర వ్రతం.. పండగ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
 
ఆరుద్ర వ్రతం ద్వారా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మహాశివరాత్రి, ఉమామహేశ్వర వ్రతం-కార్తీక పౌర్ణమిలో ఈ వ్రతాన్ని ఆచరించడం చేస్తారు. పాశుపద వ్రతం, కల్యాణ వ్రతం, అష్టమి వ్రతం, కేదార వ్రతాలను నిష్ఠతో ఆచరించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.