శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chitra
Last Updated : శనివారం, 23 జనవరి 2016 (15:50 IST)

జపాన్‌లో లక్కీ క్యాట్స్‌: పాపాల్ని పోగొడతాయట.. వ్యతిరేక శక్తుల్ని పారద్రోలుతాయట!

సాధారణంగా పిల్లి ఎదురొస్తే అపశకునంగా భావిస్తుంటాం. వెళ్లే పనిలో ఏదన్నా ఆటంకం కలుగుతుందని భయపడుతుంటారు. ఇంకా నల్ల పిల్లిను చూస్తే చీదరించుకుంటారు. పిల్లిని చాలా దేశాల్లో అలాగే చూస్తున్నారు. పెంపుడు జంతువులుగా కూడా వాటిని పెంచుకోరు. కానీ జపాన్ దేశం మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధం. పిల్లిని అదృష్ట జీవిగా భావిస్తున్నారు. మనం పెంచుకున్న మూఢనమ్మకాలను కొట్టిపారేస్తున్నారు. 
 
సాంకేతికతకు పర్యాయపదంగా మారిన జపాన్‌లో ఇప్పుడు లక్కీ క్యాట్స్ బొమ్మలు బాగా అమ్ముడవుతున్నాయి. లక్కీ క్యాట్ బొమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడం ఫ్యాషన్‌గా మారింది. బ్లాక్ క్యాట్‌లు పాపాలను పోగొడతాయని, వ్యతిరేక శక్తులను పారద్రోలతాయని చెప్తున్నారు. కెరునికో డైమియోజిన్ అనే పేరు కూడా వీటికి ఉంది. ఒకప్పుడు లాఫింగ్ బుద్ధాను పాపాలు తొలిగించుకోవడానికి, సిరిసంపదలుగా ఇంట్లో పెట్టుకున్న వారు ఆ ప్లేస్‌లోఇప్పుడు లక్కీ క్యాట్‌ను పెట్టుకుంటున్నారు. నమ్మకం సంగతి పక్కన పెడితే ఈ బొమ్మలను అమ్మే విక్రయదారులకు మంచి లాభాన్నిసంపాదించిపెడుతుంది.