శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2014 (15:17 IST)

పెళ్లీడొచ్చినా.. వివాహంలో అడ్డంకులా.. మంగళచండీ స్తోత్రం పఠించండి!

పెళ్లీడొచ్చినా వివాహంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయా? అయితే మంగళచండీ స్తోత్రం పఠించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. పెళ్లికి ఆటంకం 'కుజదోషం' కూడా కావచ్చు. కుజదోషం బారి నుంచి బయటపడటం కోసం నానాప్రయత్నాలు చేస్తుంటారు. కుజుడిని శాంతింపజేయడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది ... ఫలితంగా కుజదోష ప్రభావం తగ్గుతుంది. కుజదోష ప్రభావం నుంచి బయటపడటానికి గల మార్గాలలో ఒకటిగా 'మంగళచండీ స్తోత్ర పఠనం' కనిపిస్తుంది. 
 
కుజుడికి 'మంగళుడు' అనే పేరు ఉంది.. ఆయన మంగళచండీ మహాభక్తుడు. ఆ తల్లిని ఎవరైతే అంకితభావంతో ఆరాధిస్తూ ఉంటారో, వాళ్లపట్ల ఆయన అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. అందువలన ప్రతి మంగళవారం 'మంగళచండీ స్తోత్రం' పఠించడం వలన అమ్మవారికి ప్రీతి కలుగుతుంది.
 
ఆ తల్లికి ప్రీతిపాత్రులైన వాళ్ల విషయంలో కుజుడు కూడా శాంతమూర్తిలా వ్యవహరిస్తాడు. ఆయన నుంచి ప్రతికూల ఫలితాలు సహజంగానే తగ్గుముఖం పడతాయి. ఫలితంగా కుజదోష ప్రభావం నుంచి బయటపడటం ... వివాహయోగం కలగడం జరుగుతాయని పండితులు అంటున్నారు.