Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోమవారం దినఫలాలు .. మీ పురోభివృద్ధి మీ చేతుల్లోనే

సోమవారం, 8 జనవరి 2018 (08:33 IST)

Widgets Magazine
daily horoscope

మేషం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులు చురుకుగా సాగుతాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బాకీల వసూలులో ఓర్పు, లౌక్యం అవసరం.
 
వృషభం : భాగస్వాముల చర్చలలో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుల్లో ఏకాగ్రత వహించిన రాణిస్తారు. ముఖ్యులలో ఒకరి వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
 
మిథునం : మీ పురోభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని గమనించండి. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : ధనసహాయం, ధనవ్యయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ యత్నాలు, పథకాలు గుట్టుగా సాగించండి. 
 
సింహం : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొంత మొత్తమైన పొదుపు చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ స్వభానంవల్ల ఇబ్బందులెదుర్కొంటారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కన్య : భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. చిన్నతరహా, కుటీర పరిశ్రమవారికి ఆశాజనకం. స్టేషనరీ, ప్రిటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. వైద్యులకు ఆపరేషన్లు చేయు సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. 
 
తుల : ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచింది. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. రుణం తీసుకోవడం, ఇవ్వడం క్షేమం కాదని గమనించండి.
 
వృశ్చికం : నూతన పెట్టుబడులు లీజు, ఏజెన్సీలు మరికొంత కాలం ఆగటం మంచింది. మీ పనులు కార్యక్రమాల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచింది. 
 
ధనస్సు : వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల అవగాహనం నెలకొంటాయి. ప్రచురణ, పత్రికా రంగంలో వారికి మందకొడిగా ఉండును. మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. 
 
మకరం : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. అనుకున్నది సాధించడంలో ఉత్సాహంగా ఉంటారు. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయకండి. 
 
కుంభం : మీ శ్రీమతి, ఆత్మీయుల సలహా పాటించడం మంచిది. స్థిరాస్తి మూలక ధనం చేతికందుతుంది. స్త్రీలకు అధికమైన శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. 
 
మీనం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పపు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. మనుష్యుల మనస్తత్వము తెలిపి మసలు కొనుట మంచిది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

07-01-18 ఆదివారం రాశిఫలాలు : ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయ్

శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. దుబారా ...

news

మీ వార రాశి ఫలితాలు... 07-01-2018 నుంచి 13-01-2018 వరకు(వీడియో)

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, ధనుస్సులో రవి, బుధ, శుక్ర, శని, మకరంలో కేతువు. ...

news

06-01-18 శనివారం : గృహం కొనుగోలుకు యత్నిస్తారు

మేషం : వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. వైద్యులకు ...

news

5-01-2018 శుక్రవారం ... ఆలోచనలు గోప్యంగా ఉంచండి...

మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు ...

Widgets Magazine