బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (21:42 IST)

అక్టోబరు నెలలో మీ రాశి ఫలితాలు...

9వ తేదీన శుక్రుడు, 13వ తేదీన కుజుడు కన్యయందు, 13వ తేదీన బుధుడు, 17వ తేదీన రవి తుల యందు, 26వ తేదీ శని ధనస్సునందు ప్రవేశం. 7వ తేదీన అట్లతద్ది. 9వ తేదీన సంకటహర చతుర్థి. 12వ తేదీ నుంచి గురుమౌఢ్యమి ప్రారంభం. 18వ తేదీన నరకచతుర్థశి. 19వ తేదీన దీపావళి. 20వ త

9వ తేదీన శుక్రుడు, 13వ తేదీన కుజుడు కన్యయందు, 13వ తేదీన బుధుడు, 17వ తేదీన రవి తుల యందు, 26వ తేదీ శని ధనస్సునందు ప్రవేశం. 7వ తేదీన అట్లతద్ది. 9వ తేదీన సంకటహర చతుర్థి. 12వ తేదీ నుంచి గురుమౌఢ్యమి ప్రారంభం. 18వ తేదీన నరకచతుర్థశి. 19వ తేదీన దీపావళి. 20వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం. 21వ తేదీన భజనిహస్త భోజనం. ఈనెల ఈశ్వరాధన వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆర్థికస్థితి గతం కంటె కొంత బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఈ మాసం యోగదాయకం. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. గృహమార్పు ఫలితంగా నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. ఉద్యోగబాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. నమ్మి మోసపోయే ఆస్కారం ఉంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రయాణం కలిసివస్తుంది. 
 
మిధునరాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధ్యంకాని హమీలివ్వొద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. ధనమూలక సమస్యలెదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలమవుతాయి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వలోనే ఫలిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. కృషి ఫలిస్తుంది. పదవుల స్వీకారానికి అనుకూలం. వ్యతిరేకుల సన్నిహితులవుతారు. గృహంలో సందడి నెలకొంటుంది. శ్రమాధిక్యతతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. భాగస్వామ్యం అనుకూలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే శ్రేయస్కరం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. ప్రయాణంలో జాగ్రత్త వహించండి. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. గృహంలో ప్రశాంత నెలకొంటుంది. ఆహ్వానాలు అందుకుంటాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ఆధ్యాత్మిక విషయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ఆధ్యాత్మిక భావం పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. జూదాలు, పందేలకు దూరంగా ఉండాలి. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
ధనమూలక సమస్యలెదురవుతాయి. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. విజ్ఞతతో వ్యవహరించండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతనఉండదు. ఆరోగ్యం, సంతానం భవిష్యత్ పట్ల శ్రద్ధ అవసరం. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీ విద్యాయత్నంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రకటనలను విశ్వసించవద్దు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాల సమ్మేళనం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషాన్నిస్తుంది. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. సంతానం భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. శ్రమించినా ఫలితం ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. రుణాలు చేబదుళ్లు స్వీకరిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కుదుటపడుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పెట్టుబడుల విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు వేగవంతమవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరవం. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఈమాసం శుభదాకయం, ఆర్థికంగా పురోగమిస్తారు. రుణబాధలు తొలగుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. విలువైన వస్తువుల, నగదు జాగ్రత్త. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం, సంతానం భవిష్యత్ పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు చికాకులు తొలుగుతాయి. సహోద్యోగుల సాయం అందుతుంది. అధికారులకు హోదా, మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. జూదాలు, పందాల జోలికి పోవద్దు. 
 
ధనుర్‌రాశి  : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.
కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. విజ్ఞతతో వ్యవహరించాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుటారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. 
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
శుభవార్తలు వింటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ప్రత్యర్థులతో జాగ్రత్త. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణ విమక్తులవుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు.
దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్దానికి గురిచేస్తుంది. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. మొదలెట్టిన యత్నాలను విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం. సహోద్యోగులకు సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఆదాయం బాగుంటుంది. ఊహించని ఖర్చులో ఉంటాయి. దైవ, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్య అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.