బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (19:45 IST)

అక్టోబరు 1 నుంచి 7వ తేదీ వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

కర్కాటకంలో రాహువు, సింహంలో శుక్ర, కుజులు, కన్యలో రవి, బుధులు, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు, మకర, కుంభ, మీన, మేషంలలో చంద్రుడు. 7న అట్లతద్ది. ముఖ్యమైన పనులకు పూర్ణిమ, గురువారం శుభదినం.

కర్కాటకంలో రాహువు, సింహంలో శుక్ర, కుజులు, కన్యలో రవి, బుధులు, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు, మకర, కుంభ, మీన, మేషంలలో చంద్రుడు. 7న అట్లతద్ది. ముఖ్యమైన పనులకు పూర్ణిమ, గురువారం శుభదినం.
 
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఆర్థికంగా గతం కంటె బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. చాకచక్యంగా పనులను చక్కబెట్టుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యవహార దక్షితతో రాణిస్తారు. యత్నాలు ఫలిస్తాయి. గురు, శుక్రవారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. పెట్టుబడులు విషయంలో పునరాలోచన అవసరం. శుభకార్యం సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టిసారించండి. బంధువులతో సంత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ప్రకటనలను విశ్వసించవద్దు. హోల్‌సేల్ వ్యాపారాలకు పురోభివృద్ధి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. 
గృహమార్పు యత్నం సత్ఫలితాన్నిస్తుంది. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు తప్పవు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. శనివారం నాడు ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం, ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి నెలకొంటుంది. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మీ ఇష్టాయిష్టాలకు సున్నితంగా వ్యక్తం చేయండి. పనుల మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ధనలాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో పరిచయంలేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. విందులు వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. జూదాలకు దూరంగా ఉండాలి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సంతానం గురించి ఆలోచిస్తారు. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. రుణ విముక్తులవుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అయినవారిని సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలగుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలకు హాజరవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆది, గురువారాల్లో చాకచక్యంగా వ్యవహరించాలి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేనివారితో జాగ్రత్త. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడుపుతారు. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం, మొహమ్మాటాలకు తగవు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఎదుటివారి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. సహనం కోల్పోవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పనుల సానుకూలతకు మరింతా శ్రమించాలి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. గురు, శుక్రవారాల్లో ధనమూలక సమస్యలెదుర్కొంటారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఆత్మీయులకు చక్కని సలహా ఇస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. కంప్యూటర్, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అధికారులకు హోదా మార్పు. రచయితలు, క్రీడాకారులకు ఆశాభంగం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. విమర్శలు, అభియోగాలను పట్టించుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శనివారం నాడు ఊహించని ఖర్చులు, కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి పెద్దగా ఉండదు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ప్రయాణం కలిసివస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం. 
ఈ వారం ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామ్య, టెండర్లు, ఏజెన్సీలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వాగ్దాటితో ఆకట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. స్థోమతకు మించి హామీలివ్వొద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అస్వస్థతకు గురవుతారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి వస్తారు. ఆశించిన టెండర్లు దక్కకపోవచ్చు. పర్మిట్లు, లైసెన్సుల వ్యవహారంలో అలక్ష్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పరిశ్రమల స్థాపనకు అనుమతులు వనరులు మంజూరవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
ఆర్థిక స్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఊహించని ఖర్చులు, పెరిగి ధరలు ఆందోళన కలిగిస్తాయి. అదనపు రాబడిపై దృష్టిసారిస్తారు. పదవుల నుంచి తప్పుకుంటారు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం విజయం సంతోషపరుస్తుంది. దంపతుల్లో అన్యోన్యత నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు వాయిదాపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వైద్య, న్యాయ రంగాల వారికి పురోభివృద్ధి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. 
కుటుంబ ఆంతరంగిక విషయాలు విషయాలు వెల్లడించవద్దు. వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం క్షేమంకాదు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పనుల ప్రారంభంలో అవాంతరాలెదుర్కొంటారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు అధికం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
వీడియో చూడండి...