శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (15:47 IST)

01-06-2019 నుంచి 30-06-2019 వరకు మీ మాస ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దలను సంప్రదించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది. ఆర్థికంగా కుదుటపడతారు. రుణ సమస్యలకు తాత్కాలిక విముక్తి లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరగలవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం ప్రయోజనకరం. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు  పెరుగుతాయి. లౌక్యంగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రియుతముల గురించి ఆందోళన చెందుతారు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. బెట్టింగ్‌లు వివాదాస్పదమవుతాయి.
 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం  కాదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణయత్నాలు సాగిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. ఆద్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారాకి ఆదాయాభివృద్ధి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రేమానుబంధాలు బలపడతాయి. సమర్థతకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్త వింటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా కుదుటపడతారు. పొదుపు ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు. ప్రయాణంలో చికాకులు తప్పవు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం శుభదాయకమే. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. ప్రయోజనకరం. ఆపదలో వున్న వారికి సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోగొట్టుకున్న  పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. భాగస్వామిక చర్చలు నిరుత్సాహపరుస్తాయి. తీర్థయాత్రు, విదేశీ ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ధనం అందుతుంది. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా వుంటాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఖర్చులు అధికం. పొదుపు ధనం అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల అవగాహన లోపం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అనునయంగా మెలగాలి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సమస్యలు సర్దుకుంటాయి. మానసికంగా కుదుటపడతారు. బాధ్యతలు అధికమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. బాధ్యతగా వ్యవహరించాలి. యత్నాలు కొనసాగించండి. పరిస్థితులు నిదానంగా అనుకూలిస్తాయి. గృహమార్పు అనివార్యం. ఆదాయానికి మించి ఖర్చులు, రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.  
బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అనవసర జోక్యం తగదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఈ మాసం ఆశాజనకమే. బంధుత్వాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు, చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అధికమవుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు స్థానలచలనం. ఉన్నతాధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
వేడుకలకు హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ధన ప్రాప్తి, వాహన యోగం వున్నాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు పదోన్నతి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. 
 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభం గడిస్తారు. రవాణా రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.