సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మే 2024 (12:55 IST)

శ్రీ నరసింహ స్వామి చిత్ర పటాన్ని ఇంట వుంచి పూజించవచ్చా?

శ్రీ మహావిష్ణువు అవతారం అయిన నరసింహావతారం ఈతిబాధలను తొలగిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడేందుకు అవతరించిన ఈ నరసింహ స్వామిని పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. శనివారం పూట లేదా ప్రతిరోజూ నిష్ఠతో పూజించే వారికి ఈతిబాధలు వుండవు. ఇంకా నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి.. నేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
భక్త ప్రహ్లాదను తొడపై కూర్చుండబెట్టుకున్న నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించే వారికి రుణబాధలు, శత్రు బాధలు వుండవు. అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిమను లేదా పటాన్ని పూజించే వారికి సంపదలకు లోటుండదు. 
 
ప్రహ్లాదుడు, లక్ష్మీదేవితో కూడి నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. నరసింహ స్వామికి తులసీ దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు లభిస్తాయి. ఇంకా నరసింహ స్వామికి మందార పువ్వులను సమర్పించవచ్చు.