శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (17:12 IST)

మకర, కుంభరాశుల వారికి ఏ రంగు కలిసివస్తుందో తెలుసా?

రాశులను బట్టి రంగులను ఎలా ఎంచుకోవాలో తెలియట్లేదా..? అయితే ఈ స్టోరీ చదవండి. రాశులను బట్టి రంగులను ఎంచుకుంటే అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో భాగంగా రాశుల్లో మొదటిదైన మేషరాశి

రాశులను బట్టి రంగులను ఎలా ఎంచుకోవాలో తెలియట్లేదా..? అయితే ఈ స్టోరీ చదవండి. రాశులను బట్టి రంగులను ఎంచుకుంటే అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో భాగంగా రాశుల్లో మొదటిదైన మేషరాశి వారికి ఎరుపు, బంగారు వర్ణాలు కలిసివస్తాయి. ఈ రాశికి కుజుడు అధిపతి కావడంతో పాటు కుజునికి ఎరుపు రంగు ప్రీతి కావడంతో ఆ రంగులో దుస్తులను ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
వృషభరాశి జాతకులకు శుక్రుడు అధిపతి. శుక్రునికి తెలుపు రంగు ప్రతీక. అందుకే ఈ రాశివారికి తెలుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగులు కలిసివస్తాయి. ఇక మిథునానికి బుధగ్రహం అధిపతి. అందుకే వీరు ఆకుపచ్చ, పసుపు, వంగపండు, నీలం, గులాబీ రంగులు అదృష్టాన్నిస్తాయి.
 
ఇక కర్కాటకం రాశివారికి చంద్రుడు అధిపతి.. తెలుపు, ఆకుపచ్చ, లేత గోధుమ రంగులు కలిసివస్తాయి.
సింహరాశి వారికి సూర్యుడు అధిపతి.. ఎరుపు, నారింజ రంగులు కలిసివస్తాయి. 
కన్యారాశి వారికి బుధుడు అధిపతి. వీరు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, బూడిద రంగులు ధరించవచ్చు.
తులారాశికి శుక్రుడు అధిపతి కావడంతో ఎరుపు, నీలం, నారింజ, తెలుపు రంగులు కలిసివస్తాయి. 
 
వృశ్చిక రాశికి కుజుడు అధిపతి కావడంతో పసుపు, గోధుమ, నారింజ రంగులు అదృష్టాన్నిస్తాయి. 
ధనూరాశికి గురువు అధిపతి కావడంతో ఈ రాశివారు పసుపు, తెలుపు, లేత గోధుమ రంగు కలిసివస్తాయి.
 
మకర, కుంభ రాశులకు శనీశ్వరుడు అధిపతి. ఈ రాశుల వారికి ముదురు నీలం, నలుపు, తెలుపు రంగులు కలిసొస్తాయి. చివరిదైన మీన రాశిలో జన్మించిన వారికి ఆకుపచ్చ, నీలం, ఎరుపు, పసుపు, గులాబీరంగు, ముదురు గోధుమ రంగు, తెలుపు రంగులు అదృష్టాన్నిస్తాయి. ఈ రాశికి గురువు ఆధిపత్యం వహిస్తాడని జ్యోతిష్య నిపుణులు సెలవిస్తున్నారు.