శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (20:34 IST)

మామిడి ఆకుల తోరణాలతో.. ఆర్థిక ఇబ్బందులు పరార్

Mango Leaves
పండుగలు, విశేషాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం ఆనవాయితీ. వేపాకు, మామిడి ఆకులను ప్రతి శుక్రవారం పూట ఇంటి గుమ్మానికి కడితే శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
మామిడి ఆకుల్లో శ్రీ మహాలక్ష్మీ దేవి, వేపాకులో పార్వతీ దేవి కొలువై వుంటుంది. మామిడి ఆకులను గుమ్మం ముందు తోరణాలుగా వేలాడ దీయడం ద్వారా ఆ ఇంట ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సానుకూల ఫలితాలు చేకూరుతాయి. వాయువులోని కార్బన్-డై- యాక్సైడ్‌ను తొలగించి.. గాలిలోని క్రిములను నశింప చేస్తుంది. 
 
మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. వాటిని ప‌లు అనారోగ్యాలు తొల‌గించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు. మామిడి ఆకులు ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి లభిస్తుంది. 
 
సాధారణంగా మామిడి ఆకుల్లో ల‌క్ష్మీదేవి కొలువైవుంటుందంటారు. అందుకే ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.