శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (18:25 IST)

గురువారం: గురుదోషం- పరిహారము- శాంతులు..

గురువారం గురుదోష నివారణకు పరిహారాలు చేయవచ్చు. గురువారం పూట దగ్గరలో ఉన్న సాయిబాబా లేదా దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటలకు వరకు 9సార్లు ప్రదక్షిణములు చేయాలి.
 
గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వెళ్ళి బ్రహ్మ దేవాలయమును దర్శించుకోండి 
 
గురువారం రోజున వండిన శనగలను పేదలకు పంచి పెట్టండి. 
 
కనకపుష్యరాగము కుడిచేతి చూపుడువేలుకి బంగారములో పొదిగించుకుని ధరించగలరు. 
 
గురు గ్రహ జపము ఒక మారు బ్రాహ్మణుడితో చేయించి శనగలు దానము చేయగలరు. 
 
నవగ్రహములో గురుగ్రహము వద్ద గురువారం 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రము దానము చేయగలరు. 
 
16 గురువారాలు ఉపవాసముండి చివరి వారము దక్షిణా మూర్తి పూజ మరియు గురు అష్టోత్తర పూజ చేయాలి.