శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (17:59 IST)

రాళ్ల ఉప్పు, పసుపును ఇంటి చుట్టూ వేస్తే.. వైరస్ మటాష్

రాళ్ల ఉప్పు, పసుపును ఇంటి చుట్టూ వేయడం ద్వారా వైరస్‌ను నిర్మూలించవచ్చు. వేపాకు, పసుపు నీటిని ఇంటి గుమ్మం వద్దే ఉంచడం ద్వారా అంత సులువుగా ఇంట్లోకి బ్యాక్టీరియా, వైరస్‌లు రావని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే రాళ్ల ఉప్పును ఇంట్లోని పై స్లాబుల్లో వుంచితే వ్యాధి కారక క్రిములు నశించిపోతాయి. ఉల్లి ముక్కలను కూడా ఇంటి పై స్లాబుల్లో వుంచితే బ్యాక్టీరియా, వైరస్ కారకాలతో ఏర్పడే వ్యాధులు దరిచేరవు. 
 
ఆధ్యాత్మిక పరంగానూ రాళ్ల ఉప్పు మంచే చేస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. ఒక గాజు గ్లాసులో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి అందులో శుభ్రమైన నీటిని నింపాలి. ఈ గాజు గ్లాసును పడకగదిలోని మంచం కింద వుంచాలి.
 
రాత్రి పూట ఇలా వుంచి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని వాష్ బేసిన్‌లో పారబోయాలి. ఇలా 21 రోజులు చేస్తే.. మానసిక ఆందోళనలు దూరమవుతాయి. అలాగే వాష్ రూమ్‌ పై స్లాబ్‌లోనూ ఉప్పు నీటితో నింపిన గాజు గ్లాసును ఉంచడం ద్వారా నెగటివ్ ఫలితాలు వుండవని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.