పసిపిల్లలకు తేలికగా జీర్ణమయ్యే పప్పు చారు ఎలా చేయాలి?
పసిపిల్లలకు తేలికగా జీర్ణమయ్యే పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం.. పసిపిల్లల బొజ్జకు తగినట్లు ఆహారం అందించాలి. తొలి ఆరు మాసాలు తల్లిపాలు ఇవ్వడం.. ఆ తర్వాత తేలికపాటిగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేయాలి. అలాంటి ఆహారంలో పప్పు చారు కూడా ఒకటి. పప్పుచారు.. వేడి వేడి అన్నంలో కలిపి పిల్లలకు అందిస్తే వారి శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. అలాంటి పసిపిల్లల కోసం పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
బియ్యం - ఒక కప్పు
కందిపప్పు - రెండు చెంచాలు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
జీలకర్ర - పావు స్పూన్
ఉప్పు - తగినంత
చింతపండు - గోళికాయంత
నెయ్యి - అర స్పూన్
పసుపు - పావు స్పూన్
తయారీ విధానం :
బియ్యం నానబెట్టి, ఉడక బెట్టుకోవాలి. కొంచం కందిపప్పు వేయించి, తగిన నీరు పోసి కుక్కర్ లో బాగా మెత్తగా ఉడక బెట్టుకోవాలి. రెండిటిని కలిపి చాలా మెత్తగా గుజ్జు చేసి అందులో కొంచం చారు పోసి, నెయ్యి కలపాలి. తర్వాత చింతపండు గుజ్జును నీటిలో వేసి మరిగించాలి. అందులోనే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు వెయ్యాలి. దించేముందు కొంచెం కొత్తిమీర వేసి, తిరగమాత పెట్టాలి. ఇలా కాకుంటే.. అన్నీ పదార్థాలను కుక్కర్లో వేసి రెండు విజిల్స్ పెట్టి తాలింపు పెట్టి పిల్లలకు తినిపించినా టేస్టు బాగుంటుంది.