గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శనివారం, 28 జులై 2018 (14:07 IST)

శనివారం నాడు ఉపవాస ప్రార్థన చేస్తే... శనీశ్వరుని అనుగ్రహం...

అందరూ జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే కోరుకుంటారు. కానీ శనిదోష ప్రభావం వలన జీవితం ఇబ్బందులలో పడడం జరుగుతుంటుంది. శనిదోష ప్రభావం వలన ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అవమానాల పాలవ

అందరూ జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే కోరుకుంటారు. కానీ శనిదోష ప్రభావం వలన జీవితం ఇబ్బందులలో పడడం జరుగుతుంటుంది. శనిదోష ప్రభావం వలన ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అవమానాల పాలవుతారు. ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు హాని కలిగించే విధంగా జరుగుతుంటాయి. అందువలన శనిదోష నివారణకు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రార్థించాలి.
 
శని దేవుడిని శాంతిపజేయడానికి అనేక మార్గాలు చెప్పబడుతున్నాయి. ప్రతి శనివారం రోజున శనీశ్వరునికి ఉపవాస దీక్షను చేపట్టి సూర్యాస్తమయం తరువాత హనుమంతుడిని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఎర్రని పువ్వులతో హనుమంతుడికి అర్చించాలి. అంతేకాదు ప్రతి శనివారం రోజున కోతులకు అరటిపండ్లు, బెల్లం కలిపిన శెనగలను ఆహారంగా పెట్టాలి.
 
అలానే శెనగలను చేపలకు కూడా ఆహారంగా అందించాలి. నల్లకుక్కకు, నల్ల ఆవుకు తీపి రొట్టెలను ఆహారంగా అందించాలి. ఇలా చేయడం వలన శనిదేవుడు శాంతిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. శనిదేవుడు అనుగ్రహిచడం వలన శనిగ్రహ దోషాలు తగ్గుతూ వస్తాయి. దాంతో ఆందోళనలు, అవాంతరాలు తొగిపోతాయి. మంచి జరగడం మెుదలవుతుందని శాస్త్రంలో స్పష్ట చేయబడుతోంది.