శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 9 జులై 2016 (14:59 IST)

కంటిదృష్టికి అరటిచెట్టుకు లింకుందా? అరటి చెట్టు ప్రతి సెకనుకు చిగురిస్తుందట!!

కంటిదృష్టికి పరిహారం ఉందా? దృష్టిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. బయటి నుంచి ఇంటిని చూసేవారి దృష్టిని.. ఇంటి వాకిలిపై పడేట్లు ఏదైనా ఆకర్షణీయ వస్తువుపై పడేట్లు

కంటిదృష్టికి పరిహారం ఉందా? దృష్టిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. బయటి నుంచి ఇంటిని చూసేవారి దృష్టిని.. ఇంటి వాకిలిపై పడేట్లు ఏదైనా ఆకర్షణీయ వస్తువుపై పడేట్లు చూడాలి. ఆ వస్తువు చెట్లైనా పర్లేదు.

ఇంటి ప్రాంగణంలో ఇంటికి ముందు అరటి చెట్లను నాటినట్లైతే కంటి దృష్టి లోపాల ప్రభావం ఇంటి యజమానులపై అస్సలు పడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రతీ సెకనుకు అరటి చెట్టుచిగురిస్తూనే ఉంటుందట. ఎలాంటి కంటి దృష్టిని ఇది దూరం చేస్తుందట. అరటి చెట్టుకు ఆ గుణం ఉంటుందని వారు చెప్తున్నారు.  
 
ఇంకా మీరు పెద్ద ఇల్లు కట్టినట్లైతే ఆ ఇంటిపై ఇతరుల దృష్టి పడకుండా ఉండాలంటే.. ఇంటి గోడపై ఆకర్షణీయమైన బొమ్మల్ని ఉంచడం ద్వారా దృష్టి లోపం నుంచి గట్టెక్కవచ్చు. కొందరి ఇంటి ముందు ఓ పెద్ద పాత్రలో నీళ్ళు పోసి.. వాటిలో పువ్వుల్ని వేసి వుంచుతారు. ఇలా చేయడం ద్వారా ఇంటికొచ్చే అతిథులు, బయటి వ్యక్తుల దృష్టి దానిపై పడుతుంది. ఇలాంటి పరిహారాలతో దృష్టి ప్రభావం తమపై పడకుండా చూసుకోవచ్చు.  
 
ఇకపోతే... మొక్కలు, చెట్లకు కంటి దృష్టిని తొలగించే శక్తి ఉంటుంది. రోజా చెట్లు, నర్సరీల్లో అమ్మే చెట్లను ఇంటి ముందు నాటడం ద్వారా ఇంటిపై పడే దృష్టిని దూరం చేసుకోవచ్చు. వీటితో పాటు గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయడం, దృష్టి బొమ్మల్ని తగిలించడం, వినాయక బొమ్మను పెట్టడం, కలబంద చెట్టును వేలాడదీయడం చేస్తారు. ఇవన్నీ దృష్టిని తొలగించేవేనని పంచాంగ నిపుణులు అంటున్నారు.