శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (18:03 IST)

బుధగ్రహ అనుగ్రహం కోసం పగడాన్ని దానం చేయండి!

గ్రహ సంబంధమైన దోషాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ఆ గ్రహానికి సంబంధించిన శాంతిచేయిస్తూ వుండాలి. ఈ విధంగా ఆ గ్రహాన్ని శాంతింపజేయడం వలన, ఆ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు. 
 
అలా బుధగ్రహం మిథున రాశికీ, కన్యారాశికి అధిపతి. ఈ గ్రహానికి అధిదేవత విష్ణుమూర్తి కావడం వలన, ఈయన ఎక్కువగా మేలే చేస్తూ ఉంటాడు. అయితే బుధగ్రహ సంబంధమైన దోషంతో బాధపడుతోన్నవాళ్లకి బుద్ధి మందగించడంతో పాటు కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. 
 
ఈయనను శాంతింపజేయాలంటే 'పచ్చ'ను ధరించవలసి వుంటుంది. అంతే కాకుండా బంగారాన్నీ, పగడాన్నీ, వివిధ రకాల పండ్లను, పెసలను, నెయ్యిని బ్రాహ్మణులకు దానం చేయవలసి ఉంటుంది.