శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 13 మే 2015 (17:47 IST)

గో విశిష్టత: గోవుకు ఆకుకూరలు, పండ్లు సమర్పిస్తూ.. పితృదేవతల్ని స్మరిస్తే..!

మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాత మనల్ని పోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మన అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగ హోమాన్ని చేశాడు. శరీరం కొరరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది. 
 
గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. అగ్ని సంబంధమైన హోమం వల్ల, గోవు జన్మించడంవల్ల గోవు అగ్నిహోత్ర సమానమైంది. కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంచి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన, హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ, పితృకర్మల్లోనూ చేయాలని మన శృతి బోధిస్తోంది. 
 
గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. పితృవిధులలో, శ్రాద్ధాలలో సక్రమంగా, విధి విధానంగా చేసే అవకాశం లేనివారు ఆకుకూరలు, పళ్ళు, ఆవుకు సమర్పిస్తూ.. పితృదేవతలను స్మరిస్తే చాలు. పితరులు ఉత్తమ లోకాలను పొందుతారు. పితృరుణం తీర్చుకున్న పుణ్యఫలం లభిస్తుంది. సక్రమంగా శ్రాద్ధాదులు చేసినా సరే, ఈ విధంగా ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి.