శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 8 జనవరి 2015 (19:13 IST)

మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే?

మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఆ రోజున చాలామంది భక్తులు హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామికి సిందూర అభిషేకాలు, ఆకుపూజలు చేయిస్తుంటారు. ఆయనకి ఇష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు.
 
ఈ విధంగా చేయడం వలన స్వామి ప్రీతిచెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతోన్నవాళ్లు, దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు హనుమంతుడికి మంగళవారం పూట పూజ చేస్తే రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
ఇక నవగ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బందిపడే వారు మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే.. ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం వలన, పూజాభిషేకాలు జరిపించడం వలన, 'సుందరకాండ' పారాయణ చేయడం వలన, 'హనుమాన్ చాలీసా' చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు ... అటు శనిదేవుడు శాంతించి అనుగ్రహిస్తారని పండితులు అంటున్నారు.