శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (19:32 IST)

నైవేద్యంగా ఏది పడితే అది పెట్టకూడదు.. అర్చకుడు నియమనిష్టలతో..?

నైవేద్యంగా ఏది పడితే అది పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడికి చేసే షోడశ ఉపచారాలలో నైవేద్యం ఒకటి. ఈ నైవేద్యాన్ని అర్చకుడు మడి కట్టుకుని నియమనిష్టలను పాటిస్తూ తయారుచేస్తాడు. సాధ్యమైనంత వరకూ ఈ మహానైవేద్యం ఆలయపరిధిలో గల వంటశాలలోనే తయారు చేయబడుతూ వుంటుంది. ఇక నైవేద్యమనేది తినడానికి వీలుగా వుండేంత వెచ్చగా ఉన్నప్పుడే భగవంతుడికి సమర్పించాలి. చల్లగా చల్లారిపోయిన నైవేద్యాలు భగవంతుడికి పెట్టకూడదు. 
 
ఇలా భగవంతుడికి సమర్పించే మహానైవేద్యం నియమనిష్టలతో కూడినదిగా కనిపిస్తుంది. అందువలన ఇంటిదగ్గర తయారుచేసిన పదార్థాలు అక్కడి పూజామందిరం చెంతనే నైవేద్యంగా పెట్టాలి. ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేసిన దైవానికి వాటిని నైవేద్యంగా సమర్పించే ప్రయత్నాలు చేయకూడదు. భక్తులు ఎప్పుడూ భగవంతుడికి వివిధరకాల పండ్లను మాత్రమే నైవేద్యంగా తీసుకురావాలి. వాటిని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి, కొన్ని పండ్లను తిరిగి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన దైవదర్శన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.