శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 11 మే 2015 (18:29 IST)

సుబ్రహ్మణ్య స్తుతి: కుజ దోష నివారణకు మంగళవారం..?

సుబ్రహ్మణ్య స్తుతి : 
''హేస్వామి నాథ కరుణాకర దీనబంధో 
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో 
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ 
వల్లీసనాథ మమదేహీ కరావలంబమ్ |''
ఓ స్వామి కరుణాకర.. దీన బంధూ శివ పార్వతుల తనయుడవై వల్లీదేవి సహితంగా దేవగణం చేత పూజలందుకుంటున్నఓ సుబ్రహ్మణ్యేశ్వరా నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను. 
 
నవగ్రహాల్లో కుజునిది మూడోస్థానం. ఈయన చతుర్భుజాలతో, ఎరుపు రంగు కలిగిన మేక వాహనంపై దక్షిణాముఖుడై గదాశక్తి ధారుడై ఉంటాడు. 
 
''లోహితో లోహితాక్షశ్చ సామగానం కృపాకరః
ధరాత్మజః కుజో భౌమే, భూమదో భూమి నందనః ''
 
ప్రతి మంగళవారం నవగ్రహాలు లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి పై శ్లోకాన్ని భక్తితో పఠిస్తూ ఏడుసార్లు ప్రదక్షిణం చేసి, బెల్లం నైవేద్యం పెట్టి, రాత్రికి ఉపవాసం చేయాలి. ఈ ప్రకారం ఏడు నెలలు కానీ, ఏడువారాలుకానీ, దీక్షతో చేసినట్లైతే సమస్త (అంగారక) కుజదోషాలు పోయి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి. కుజ ప్రభావం వల్ల సంతానం కలగకపోయినా సంతానం నిలవకపోయినా సుబ్రహ్మణ్యారాధన చేయాలి.