శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (20:37 IST)

వాతం తగ్గాలంటే.. సంక్రాంతి రోజు తెలకపిండితో స్నానం చేసి..?

మకర రాశికి శని అధిపతి. శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వాతం తగ్గాలంటే సంక్రాంతి నాడు తెలకపిండితో స్నానం చేసి, నువ్వులు బెల్లం గుమ్మడికాయ మొదలైన దానాలు ఇవ్వడమే ఇందుకు తగిన పరిహారమని వారు చెప్తున్నారు. అలాగే పితృదేవతల రుణం తీర్చుకోవాలంటే.. సంక్రాంతి రోజున పితృతోరణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ఉత్తమం.
 
పంచభూతాల రుణం తీర్చుకోవాలంటే.. పొలాల్లో పొంగలి మెతుకు, పసుపు కుంకం చల్లి ఎర్ర గుమ్మడికాయను పగల కొట్టి దిష్టి తీయడం చేయాలి. పాడిపశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి. ఎద్దులు వ్యవసాయంలో తీవ్రంగా శ్రమిస్తాయి. అందుచేత కృతజ్ఞతాసూచకంగా కనుమ నాడు పశువులను, పశుశాలలను శుభ్రం చేసి అలంకరిస్తారు.

వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు. ఇంటి ముంగిళ్ళలో బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇలా మూగ జీవులకు, భూమికి కృతజ్ఞత చెప్పడమే ఈ పెద్ద పండుగ ముఖ్య ఉద్దేశం.