శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 16 జులై 2014 (18:16 IST)

శ్రీవారి.. శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన కానుకలేంటో తెలుసా?

తిరుమల వేంకటేశ్వరుడిని ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. వేసవి సెలవలు, పర్వదినాలు మొదలైన సందర్భాల్లో అయితే ఆ సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ భక్తుల కానుకలతో తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల ఆస్తులను కూడబెడుతోంది. నల్లధనం మూలుగుతున్న పెద్దలు కొందరు లక్షల సొమ్మును మూటకట్టి గోప్యంగా హుండీలో వేయడం వంటివి వినేవుంటాం.
 
తిరుమల వేంకటేశ్వరునికి 12వ శతాబ్దం నుండి కానుకలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. తంజావూరు రాజులు కిరీటాన్ని కానుకగా సమర్పించినట్లు ఆధారాలున్నాయి. 14వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 8 సార్లు తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుని, కానుకలు సమర్పించినట్లు శాసనాలు ధృవీకరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిన ఎనిమిదిసార్లు ఏమేం సమర్పించారంటే.. 
30,000 బంగారు నాణాలతో శ్రీవారికి కనకాభిషేకం 
 
30,000 వరహాలతో బంగారు విమానాలకు పూత పూయించారు
వజ్రాలు, వైడూర్యాలు, పచ్చలు, నీలాలు, కెంపులు, మాణిక్యాలు, గోమేధికాలు మొదలైన నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం 
మూడు పేటల కంఠహారం, స్వర్ణ ఖడ్గం, రత్న ఖచిత ఖడ్గం, నిచ్చెన కఠారి, భుజకీర్తులు, 30 తీగల పతకం, ఉడుధార
 
ముత్యాల హారం 
శ్రీవారికి రెండు బంగారు పాత్రలు
 
బంగారు పళ్ళేలు 510,000 వేల వరహాల శ్రీవారి ఆలయ ఖర్చు నిమిత్తం అమూల్య రత్నాలు పొదిగిన కంఠహారాలు, ప్రభావళి, పతకాలు మొదలైనవి రాణులు, శ్రీవారికి సమర్పించారు 
 
ప్రతి గురువారం శ్రీవారి పులికప్పు సేవ నిమిత్తం 1000 వరహాలు, ఆనంద విమానం పూత నిమిత్తం మాన్యాలు ఇచ్చారు. తిరుమల కొండకు దిగువన రేణిగుంట సమీపంలో ఉన్న కరంబాది గ్రామం శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనే శ్రీవారికి మాన్యంగా ఇవ్వడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.