శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (12:23 IST)

బ్రహ్మంగారి కాలజ్ఞానం- ఒకరి ఆలి మరొకరి పాలయ్యేను.. రాతి తేలు నడిచిపోవును?

ఒకరి ఆలి మరొకరి పాలయ్యేను (విడాకులు పొందిన స్త్రీ మరో వివాహం చేసుకోవడం) సర్వసాధారణమవుతుందని.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రాహ్మణులు లేకుండానే కార్యాలు నిర్వర్తిస్తారు. అంటే ముందుగానే రికార్డు

ఒకరి ఆలి మరొకరి పాలయ్యేను (విడాకులు పొందిన స్త్రీ మరో వివాహం చేసుకోవడం) సర్వసాధారణమవుతుందని.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రాహ్మణులు లేకుండానే కార్యాలు నిర్వర్తిస్తారు. అంటే ముందుగానే రికార్డు చేయబడిన క్యాసెట్ ద్వారా శుభకార్యాలు చేయడం వంటివి జరుగుతూనే వున్నాయి. కాశీపట్నం 40 రోజులు పాడుపడేను.. 1912వ సంవత్సరంలో గంగానదికి ఉధృతంగా వరదలు వచ్చి కలరా వ్యాధి ప్రబలి 40 రోజులు యాత్రికులు రావడం ఆగిపోయింది. 
 
కంచి కామాక్షి కనుల వెంట నీరు కారేను. తద్వారా జనులు నశిస్తారు. నిప్పుల వర్షం కురుస్తుంది. శ్రీశైల యాత్రకు వీలు లేకపోవును, కాశి, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహత్తులు తగ్గిపోతాయి. పుణ్యక్షేత్రాల్లో పాపాలు పెరుగును. త్రిపురాంతకుని గుడి యందుగల కంబాన వున్న రాతి తేలు నడిచిపోవును.

కంభం చెరువు సమీపంలో కోడి మనిషి వలె మాట్లాడును. ఎర్రచీమ ఏనుగు రూపమున కనిపించును. అది నా రాకకి గుర్తు. రుణాలు చేసి అసత్యాలు పలికి రుణాలు ఎగగొట్టేవారు అధికమవుతారు. ఈత చెట్టు ఒకటి పగటిపూట నిలబడి, రాత్రికి భూమిపై పడి నిద్రపోవును. ఈ ఘటన 1976లోనే జరిగింది.