Widgets Magazine

మన గృహంలోనే తథాస్తు దేవతలు వుంటారా?

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (13:15 IST)

మన గృహంలోనే తథాస్తు దేవతలు వుంటారట. కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ... ఇంటిలోపలే ''తథాస్తు'' దేవతలు వుంటారని పండితులు చెపుతుంటారు. మనం మంచిచెడు పలికే సమయాల్లో ఆ దేవత ''తథాస్తు'' అని పలుకుతుందట. మన నోటి గుండా వచ్చే మాటలకు తథాస్తు అంటూ అలాగే జరగుతుందని.. ఆమోద ముద్ర వేయడం ఈ దేవత చేసే పని. 
 
అయితే మంచైనా, చెడైనా ఈ దేవత ''తథాస్తు'' అని టక్కున చెప్పేస్తుందట. అందుకే మనం ఎప్పుడూ మంగళదాయకంగా మాట్లాడాలని పండితులు సూచిస్తున్నారు. మన నోటినుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే వుండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకు పక్కింటివారు మనవద్ద ఏదైనా వస్తువు కావాలని అడిగినప్పుడు.. మన చేతిలో వుండి.. లేదని చెప్పకూడదు. లేదు అనే మాట మీ నోట వస్తే.. తథాస్తు దేవత అలాగే కానీ అంటూ ఆమోద ముద్ర వేస్తుందట. 
 
ఇతరులకు ఇంట లేని వస్తువునైనా వున్నట్లు చెప్పాలి. ఎలాగంటే.. ఇంట్లో మీరడిగిన వస్తువు ఇన్నాళ్లు వున్నది. కానీ ఆ వస్తువును షాపు నుంచి ఇప్పుడు కొనుక్కురావాలని చెప్పాలి. అలాగే అప్పు కోసం వస్తే.. లేదు అనే మాట చెప్పకుండా మీకు ఇచ్చే స్థాయికి నేను ఎదగాలని చెప్పండి.

తథాస్తు దేవత ''తథాస్తు'' అంటుంది. అలాకాకుండా లేదు.. అనే పదాన్ని పదే పదే వాడితే.. డబ్బో లేకుంటే ఇతర వస్తువులు లేకుండానే పోతాయని పండితులు చెప్తున్నారు. మంగళపూర్వకమైన మాటలతోనే మంచి జరుగుతుందని.. చెడు మాటలు, అశుభవార్తలను ఇంట ఉపయోగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

బుధవారం (04-04-2018) దినఫలాలు - మీ వ్యక్తిగత భావాలకు...

మేషం : స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. ...

news

పితృదోషాలను ఎలా నివృత్తి చేసుకోవాలి? కాళహస్తీశ్వరాలయంలో?

పితృదేవతలుగా మృతిచెందిన మన పూర్వీకులకు పరిగణిస్తాం. తల్లిదండ్రులకు పెద్దలైన వారు ఈ ...

news

మంగళవారం (03-04-18) మీ రాశిఫలితాలు - ఆధ్యాత్మిక చింతన...

మేషం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ ...

news

మంగళవారం కుమార స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే..

నవగ్రహాల్లో కుజునికి అధిపతి కుమారస్వామి. కుజదోషం వున్నవారు, ఈతిబాధలతో ఇబ్బందిపడేవారు ...

Widgets Magazine