గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 28 డిశెంబరు 2017 (12:10 IST)

2018 వృషభ రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయంటే?

వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదములు (ఈ, ఊ, ఏ), రోహిణి 1, 2, 3 పాదములు (ఓ,వా,వీ, వూ), మృగశిర 1, 2 పాదములు (వే, వో). ఆదాయం-11, వ్యయం-5, పూజ్యత-1, అవమానం-3. ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు షష్ఠమము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా సప్తమము నందు, ఈ సంవత్స

వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదములు (ఈ, ఊ, ఏ), రోహిణి 1, 2, 3 పాదములు (ఓ,వా,వీ, వూ), మృగశిర 1, 2 పాదములు (వే, వో). ఆదాయం-11, వ్యయం-5, పూజ్యత-1, అవమానం-3. 
 
ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు షష్ఠమము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా సప్తమము నందు, ఈ సంవత్సరం అంతా తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా అష్టమ శని సంచరిస్తారు. 
 
ఈ గోచారం పరీక్షించగా ''సిరిదా వచ్చును నారికేళ జలంబువోలె'' అన్నట్లు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. అయితే గురువు అన్ని సమయాల్లో అనుకూలతను తక్కువగా ఇస్తున్నాడనే చెప్పవచ్చు. కానీ కుటుంబీకులు కొంత అనారోగ్యానికి గురవుతారు. ఆర్థిక విషయములందు సాధారణ స్థితి కలిగి వుంటారు. ఫ్యాన్సీ, కిరిణా మందుకు, రసాయనిక ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారులకు శుభదాయకం. నిర్మాణ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు మంచి మంచి సంబంధాలు నిశ్చయమవుతాయి. 
 
వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం ఏ మాత్రం సహకరించదు. రావలసిన ధనం జాప్యం అవుతుంది. ఉద్యోగులు ఉన్నస్థితిని చేరటానికి చేసే యత్నాలు కొంతవరకు ఫలిస్తాయనే చెప్పవచ్చు. తెలివితేటలతో సమస్యలకు సాధించి ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగ యత్నాలు కలిసిరావు. రాజకీయాల్లో వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ పదవులు నిలబెట్టుకోగలుగుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. కళా, క్రీడా రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. స్నేహితులతో కూడి విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. శుభకార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు.
 
సంఘంలో గౌరవం ఇనుమడిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఎక్కువగా ఒంటరి ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఈ సంవత్సరం అంతా అభివృద్ధి అంతగా ఉండదు. నష్టము ఉండదు. మందులు, ట్రాన్స్‌పోర్ట్, రవాణా రంగాల్లో వారు క్రమేపీ లాభాల పడతారు. రుణ విముక్తికై చేయు ప్రయత్నాల్లో కొంత చికాకులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి వానిని తీర్చగలుగుతారు. విద్యార్థులు న్యూనత భావం వీడి ముందుకు సాగిన సత్ఫలితాలు పొందుతారు. ప్రతి రంగంలోనూ విద్యార్థినులే ఒకడుగు ముందుండి సత్ఫలితాలు సొంతం చేసుకుంటారు. 
 
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. సంతాన విషయాల్లో మీరు ఆశించినంత అభివృద్ధి కనపడకపోవడంతో కొంత అసంతృప్తికి గురవుతారు. పండితులకు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారికి అరుదైన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల్లోవారికి ఏ మాత్రం తీరిక ఉండదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి ఒత్తిడితో కూడిన వాతావరణం నెలకొంటుంది. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ప్రశాంతత లభిస్తుంది. షేర్ మార్కెట్ లాభాల దారి పడుతుంది.
 
* 2019 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం కృత్తికా నక్షత్రం వారు 9 సార్లు, రోహిణి నక్షత్రం వారు 20సార్లు, మృగశిరా నక్షత్రం వారు 9సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, తెల్లని పూలతో శనిని పూజించిన సర్వదోషాలు తొలగిపోతాయి. 
 
* ఈ రాశివారు "ఇష్టకామేశ్వరిదేవిని" లక్ష్మీనృసింహస్వామిని పూజించిన మనోసిద్ధి చేకూరుతుంది.  
 
* కృత్తికానక్షత్రం వారు "స్టార్‌రూబి'' రోహిణినక్షత్రం ''ముత్యం", మృగశిర నక్షత్రం వారు ''పగడం'' ధరించిన శుభం కలుగగలదు. 
 
* కృత్తికానక్షత్రం వారు ''అత్తి'' చెట్టును, రోహిణి నక్షత్రం 'నేరేడు', మృగశిర నక్షత్రం వారు ''మారేడు'' దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లోని గానీ నాటిన మీకు అభివృద్ధి కానవస్తుంది.