శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Modified: శుక్రవారం, 16 మార్చి 2018 (21:52 IST)

ఈ ఉగాది ఆదివారం వస్తోంది... ఎలా పూజించాలో తెలుసా?

ఉగాది మార్చి 18 ఆదివారం నాడు వస్తోంది. ఐతే సంవత్సరాది వచ్చే రోజును బట్టి పూజలు చేసుకోవాలి. ఉగాది నాడు వేకువ జామునే లేచి తలకు నూనె పట్టించి తలంటు స్నానం చేయాలి. ప్రత్యేకించి పర్వదినాలలో నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై వుంటారని ప్రతీతి. అందు

ఉగాది మార్చి 18 ఆదివారం నాడు వస్తోంది. ఐతే సంవత్సరాది వచ్చే రోజును బట్టి పూజలు చేసుకోవాలి. ఉగాది నాడు వేకువ జామునే లేచి తలకు నూనె పట్టించి తలంటు స్నానం చేయాలి. ప్రత్యేకించి పర్వదినాలలో నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై వుంటారని ప్రతీతి. అందువల్ల తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆ ఇద్దరి దేవేరుల అనుగ్రహం పొందుతారని విశ్వాసం. 
 
స్నానం పూర్తయ్యాక నూతన వస్త్రాలు ధరించి, ఇల్లు శుభ్రం చేసుకుని, ఇంటికి మామిడి తోరణాలు, పూజకు కావల్సినవి సిద్ధం చేసుకోవాలి. గడపకు పసుపు రాసి, బొట్టు పెట్టాలి. ఉగాది రోజున బ్రహ్మను పూజించాలని తెలుసు కదా. అలాగే ఈరోజు పూజించాల్సిన మరో దైవం కూడా వుంటారు. ప్రతి తెలుగు సంవత్సరానికి ఓ అధిష్టాన దేవత వుంటారు. అలాగే ఉగాది ఏ వారం ప్రారంభమవుతుందో ఆ సంవత్సరానికి ఆ వారం గ్రహం రాజవుతాడు. 
 
ఇది విళంబి నామ సంవత్సరం కనుక " ఓం విళంబి సంవత్సర దేవతాం సవిత్రే నమః" అని నమస్కారం చేసుకోవాలి. ఈ కొత్త తెలుగు సంవత్సరాది ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరానికి సూర్యుడు. కాబట్టి సూర్యాష్టకం తదితర శ్లోకాలు చదువుతూ పూజ చేయాలి. అలాగే ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. షడ్రుచులు కలిగిన పులుపు, చేదు, తీపి, ఉప్పు, కారం, వగరుతో చేసిన ఉగాది పచ్చడి చేసి దేవునికి నివేదన ఇవ్వాలి.